దీపిక సందీప్ కు పెట్టిన కండిషన్సే దీనికి కారణం స్పిరిట్ నిర్మాతను 25 కోట్ల రెమ్యునరేషన్, బిజినెస్‌లో వాటా, 25 మంది స్టాఫ్‌కు ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు, అలాగే రోజుకు 7 గంటలే పనిచేస్తానని డిమాండ్లు విధించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు దీపికా పదుకొనే మ్యాటర్ హాట్ హాట్ గా ఉంది. సందీప్ రెడ్డి వంగా తో సున్నం పెట్టుకున్నందుకు రెండు సినిమాలు వదులుకుంది. జాతీయ మీడియాతో పాటు ప్రాంతీయ భాషల్లో ఈ వార్త ట్రెండింగ్ గా మారింది. దీపిక పదుకొన్ డిమాండ్లు ..గొంతమ్మ కోరికలు భరించలేక ఇప్పుడు కల్కీ లో కూడా తీసేశారు. నిజానికి కల్కీ లో దీపికా చాలా ఇంపార్టెంట్ ...తనను తీసేస్తే కథ మొత్తం డిస్టర్బ్ అవుతుందని తెలిసినా మూవీ టీం పెద్ద రిస్క్ చేసిందనే చెప్పాలి.
దీపిక ప్లేస్ లో రష్మికమందన్న ను రీప్లేస్ చేసే అవకాశముంది. అయితే దీపిక సందీప్ కు పెట్టిన కండిషన్సే దీనికి కారణం స్పిరిట్ నిర్మాతను 25 కోట్ల రెమ్యునరేషన్, బిజినెస్‌లో వాటా, 25 మంది స్టాఫ్‌కు ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు, అలాగే రోజుకు 7 గంటలే పనిచేస్తానని డిమాండ్లు విధించింది. దీంతో తిక్కరేగి సందీప్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు దీపిక ప్లేస్ లో రష్మిక ను రీప్లేస్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. రీసెంట్ గా యానిమల్ , ఛావా , పుష్ప-2 చిత్రాలతో భారీ విజయాలను అందుకొన్నది. దీపిక చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుంది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలోను, అలాగే బాలీవుడ్ చిత్రం రామాయణ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. రామాయణ్ సినిమా కోసమే కల్కి 2 సినిమాను వదులుకొనేందుకు ప్లాన్ చేసిందనే రూమర్ కూడా ఉంది.