తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు. వీరందరిలో చాలా స్పెషల్ డైరెక్టర్ అంటే ఆర్జీవి మాత్రమే గుర్తుకొస్తారు. అలాంటి ఆర్జీవి ఏం మాట్లాడినా వివాదాస్పదంగానే ఉంటుంది. ముఖ్యంగా
న్యూస్ లైన్ డెస్క్:తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు. వీరందరిలో చాలా స్పెషల్ డైరెక్టర్ అంటే ఆర్జీవి మాత్రమే గుర్తుకొస్తారు. అలాంటి ఆర్జీవి ఏం మాట్లాడినా వివాదాస్పదంగానే ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ కామెంట్స్ చేయడంలో ఈయనను మించిన వారు ఎవరూ లేరని చెప్పవచ్చు. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా చెప్పే తత్వం ఆర్జీవికి ఉంటుంది. అలాంటి ఆర్జీవి ఎంతోమంది కొత్త నటులకు ఆఫర్లు ఇచ్చి ఇండస్ట్రీలో రాణించేలా చేశారు. అలాంటి రాంగోపాల్ వర్మ ఎవరు ఏమనుకుంటారు అని ఆలోచించరు తాను చెప్పదలచిన విషయాన్ని డైరెక్టుగా చెప్పేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి.
అలాంటి వర్మ సినిమాలు తీయకపోయినా సరే తన స్టార్ స్టేటస్ మాత్రం పడిపోవడం లేదు. ఇప్పటికీ వర్మ ఏ విధమైన కామెంట్స్ చేసినా కానీ అభిమానులు ఆరాధిస్తారు. ముఖ్యంగా బోల్డ్ కామెంట్స్ ఏవైనా సరే డైరెక్ట్ గానే మాట్లాడతారు. అయితే వర్మ ఇక అమ్మాయిల గురించి మాత్రం చాలా డిఫరెంట్ గా చెబుతూ ఉంటారు. ఎవరైనా అమ్మాయి నచ్చితే తప్పకుండా ఆమెతో సినిమా చేయాలని ఆలోచిస్తారు. రెండు సంవత్సరాల క్రితం వర్మ లెస్బియన్ అనే సినిమాను తీసుకువచ్చారు. ఇందులో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి.
అలాంటి వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇప్పటివరకు ఏ హీరోయిన్ తో కూడా డేటింగ్ చేయలేదని, వాళ్ళని బయటకు కూడా తీసుకెళ్లలేదని అన్నారు. వారందరికీ నేను నచ్చి నా ఇంట్లోకి వచ్చి ఉంటారని తెలియజేశారు. అయితే మీరు ఎక్కువగా అమ్మాయిలని ఇష్టపడతారా లేదంటే ఆంటీలను ఇష్టపడతారా అని యాంకర్ ప్రశ్నించగా.. నాకు ఇద్దరు ఇష్టమే.. ఎవరిలో ఉండే అట్రాక్షన్ వారిలో ఉంటుంది..
కాస్త అనుభవం ఉన్నవారు మనల్ని కాస్త డామినేట్ చేస్తారు, అనుభవం లేని వారు కాస్త భయపడతారు. అనుభవం అనేది ఏ పనిలో అయినా వర్తిస్తుందని అన్నారు వర్మ. ఇక మియా మాల్కోవా తనకు ఎంతో నచ్చుతుందని ఆమె బాడీ లాంగ్వేజ్ అంటే నాకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఆమెతో శృంగా**రం చేయడం మాత్రం నాకు ఇష్టం లేదని అన్నారు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరాలవుతున్నాయి.