Marriage:సిద్ధార్థ్ అదితిరావు పెళ్లి వేదిక పిక్స్.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో సిద్ధార్థ్ అంటే తెలియని వారు ఉండరు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి సిద్ధార్థ్ బావా, బొమ్మరిల్లు,


Published Aug 31, 2024 08:50:00 AM
postImages/2024-08-31/1725072146_siddarth.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో సిద్ధార్థ్ అంటే తెలియని వారు ఉండరు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి సిద్ధార్థ్ బావా, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే చిత్రాలు అద్భుతమైన హిట్  అందించాయి. అలాంటి ఆయన సినిమా కెరియర్ పరంగా బాగానే ఉన్నారు కానీ  తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఇప్పటికే ఒకరిని వివాహం చేసుకొని దూరమైపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ అదితి రావు హైదరితో ప్రేమలో పడ్డాడు.

వీరిద్దరూ కలిసి ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం, వేకేషన్స్ వెళ్లి ఎంజాయ్ చేయడం ఇలా వీరి ప్రేమ వివాహాన్ని బయట అందరికీ తెలిసేలా చేశారు.  అయితే వీరిద్దరు మహాసముద్రం మూవీ షూటింగ్ సమయంలో పరిచయమయ్యారు అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి కూడా చేసుకుందామని సిద్ధమైపోయారట. అయితే ఇప్పటికే విరి నిశ్చితార్థం కూడా దగ్గర బంధుమిత్రుల మధ్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే తరుణంలో వీరి పెళ్లి గురించి అందరికీ ఆసక్తి నెలకొని ఉంది. అయితే వీరి పెళ్లికూడా  త్వరలోనే జరగబోతుందని అది కూడా, వేదిక కూడా అక్కడే అని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

 ఒక ఇంటర్వ్యూలో అదితిరావు హైదరి నాకు మా నానమ్మ అంటే చాలా ఇష్టం. నేను ఏ విషయం అయినా ఆమెతో షేర్ చేసుకుంటాను.  హైదరాబాదులో ఆమె ఒక స్కూల్ ప్రారంభించింది అది నాకు ఎంతో ఇష్టం.నా చిన్ననాటి రోజులు మొత్తం అక్కడే గడిచాయి. అయితే గత కొంతకాలం క్రితం ఆమె మరణించింది. ఈ విషయం మొత్తం సిద్ధార్థ్ కి తెలుసు.  ఇక ఓ రోజు నన్ను అదే స్కూల్ దగ్గరికి తీసుకెళ్లి మోకాళ్ళపై కూర్చొని డైరెక్ట్ గా నాకు ప్రపోజ్ చేశాడు.  నానమ్మ ఆశీస్సుల  కోసమే నాకు ఆయన ప్రపోజ్ చేసినట్టు తెలియజేశాడు.  

ఆయన నాకు ప్రపోజ్ చేసిన విధానం చాలా నచ్చింది. అందుకే యాక్సెప్ట్ చేశానని చెప్పుకొచ్చింది.  ఇక మా పెళ్లి వేదిక విషయానికి వస్తే వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం రంగనాథ స్వామి దేవాలయం మాకు చాలా ప్రత్యేకం. మా ఎంగేజ్మెంట్ కూడా అక్కడే జరిగింది. పెళ్లి కూడా అక్కడే జరుగుతుంది.  త్వరలోనే పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పడంతో సిద్ధార్థ్ అభిమానులు సంబరపడిపోతున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line marraige siddarth athidhi-rao-hydari bava bommarillu mahasamudram

Related Articles