చట్టం ఎవరికి చుట్టం కాదని కొన్ని కొన్ని సంఘటనలు మనం చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా విదేశాల్లో చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా అమలవుతూ ఉంటాయి. అలా విదేశాల్లో భార్య తప్పు చేస్తే భర్తకు శిక్ష
న్యూస్ లైన్ డెస్క్: చట్టం ఎవరికి చుట్టం కాదని కొన్ని కొన్ని సంఘటనలు మనం చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా విదేశాల్లో చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా అమలవుతూ ఉంటాయి. అలా విదేశాల్లో భార్య తప్పు చేస్తే భర్తకు శిక్ష పడింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తాజాగా తైవాన్ లో జరిగినటువంటి ఈ ఘటన అందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని దాన్ని రుజువు చేసుకునేందుకు భర్త వేసిన ప్లాన్ అతనికి బెడిసి కొట్టింది. చివరికి జైలు పాలు చేసింది. అసలు విషయంలోకి వెళ్తే..
తైవాన్ లో నివాసం ఉండే పాన్ అనే వ్యక్తికి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి భార్య బిహేవర్ పై అనుమానం పెంచుకున్న భర్త ఆమె ఆమె చేసే తప్పులను ఎలాగైనా బట్టబయలు చేయాలనుకున్నాడు. దీంతో ఆమెకు తెలియకుండా ఇంట్లో సీక్రెట్ కెమెరాలు అమర్చాడు. అలా కొన్నాళ్లపాటు గమనించిన ఆయనకు నిజం తేటతెల్లమైంది. భర్త ఆఫీస్ కి వెళ్ళగానే ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ కెమెరాకు చిక్కింది. ఈ వీడియోలను డైరెక్ట్ గా తన భార్యకు చూపించి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు.
అయినా ఆమె పట్టించుకోకుండా అతడే కావాలని మొరాయించింది. దీంతో భర్త కోర్టుకు వెళ్లి విడాకుల కోసం అప్లై చేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. కథ అడ్డం తిరిగి అతనికే న్యాయస్థానం చుక్కలు చూపించింది. విడాకుల కోసం ఆయన అప్లై చేసిన దానిని కొట్టివేసి, నీ భార్య వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించావని ఆరోపణ చేస్తూ ఆయనపైనే రివర్స్ కేసు పెట్టేసి జైలు పాలు చేసింది. అంతే కాదు మూడు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. ఈ విధంగా భార్య తప్పు చేస్తే భర్తకు కోర్టులో శిక్ష పడడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటో కూడా చెప్పండి.