పనోలి అరెస్ట్ అయినప్పటి నుంచి తమ కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అతని తండ్రి ఆరోపించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్స్ ,లా విద్యార్ధిని శర్మిష్ఠ పనోలి అరెస్ట్ కు కారణమైన ఫిర్యాదుదారు వజాహత్ ఖాన్ అదృశ్యం కావడం కలకలం రేపుతుంది. గత ఆదివారం రాత్రి నుంచి వజాహత్ ఖాన్ కనిపించడం లేదు. పనోలి అరెస్ట్ అయినప్పటి నుంచి తమ కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అతని తండ్రి ఆరోపించారు.
శర్మిష్ట పనోలిని కోల్ కత్తా పోలీసులు గురుగ్రామ్ లో అరెస్ట్ చెయ్యడం తీవ్ర దుమారం రేపింది. ఆపరేషన్ సిందూర్ విషయంలో ముస్లిం యాక్టర్స్ అంతా నోరు మూసుకొనే ఉన్నారు. దీనిపై విమర్మస్తూ వీడియో పోస్ట్ చేసినందుకు గాను ఆమె అరెస్ట్ అయ్యారు. వజాహత్ ఖాన్ ఫిర్యాదుతోనే పోలీసులు శర్మిష్టను అరెస్ట్ చేశారు.
వజాహత్ ఖాన్ తండ్రి సాదత్ ఖాన్ ఓ జాతీయ చానల్‌తో మాట్లాడుతూ "పనోలి అరెస్ట్ అయినప్పటి నుంచి మాకు బెదిరింపులు వస్తున్నాయి. నా కొడుకు లౌకికవాది.అతను ఎప్పుడు హిందూ మతాన్ని అవమానించలేదు. తన కొడుకు అలా పోస్టులు పెట్టలేడు. ప్రొఫైల్ హ్యాక్ అయ్యి ఉండవచ్చు. కొన్నిరోజులుగా తన కొడుకుకు హిందూ సమాజానికి వ్యతిరేకంగా అవమానకరంగా మాట్లాడుతున్నారని వజాహత్ ఖాన్ తండ్రి తెలిపారు.
వజాహత్ ఖాన్ అనే వ్యక్తి హిందువులను ‘రేపిస్ట్ కల్చర్స్’ (అత్యాచార సంస్కృతులు), ‘యూరిన్ డ్రింకర్స్’ (మూత్రం తాగేవారు) వంటి పదజాలంతో కించపరిచాడని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. హిందూ దేవుళ్లను తిడుతూ , పండుగలను వెక్కిరిస్తూ వీడియో చేశాడు. ఈ వీడియోతో పాటు మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే కంటెంట్ ను ఖాన్ వ్యాప్తి చేస్తున్నాడని పేర్కొన్నారు.వజాహత్ ఖాన్ చేసిన ఆరోపిత పోస్ట్‌పై అస్సాంలో కూడా ఒక కేసు నమోదైంది.