హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తప్ప తాగి 12 ఏండ్ల కన్న కూతురిపై ఓ తండ్రి లైంగికదాడి చేశాడు.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తప్ప తాగి 12 ఏండ్ల కన్న కూతురిపై ఓ తండ్రి లైంగికదాడి చేశాడు. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి(36) నగరానికి వచ్చి మేడిపల్లిలోని సాయినగర్ కాలనీలో ఉంటూ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడిని భార్య వదిలిపెట్టిపోవడంతో తల్లితో ఉంటున్నాడు. కూతురు(12)ను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు.
కొన్ని రోజుల కిందట కూతురుకు జ్వరం రావడంతో ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో తల్లి లేని సమయంలో అర్ధరాత్రి మద్యం మత్తులో కూతురిపై లైంగిక దాడిక పాల్పడ్డాడు. బాలికకు జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు పంపారు. బలికను వైద్య పరీక్షల కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.