పర్వతమాల పరియోజన ప్రాజెక్ట్ లో భాగంగా గుట్టపైకి వెళ్లేందుకు రోప్ వే ఏర్పాటు చేసేందుకు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్ . యాదాద్రి భక్తులకు కొండపైకి వెళ్లడానికి భక్తులకు చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టి మరింత ఈజీ చేయడానికి కేంద్రం సూపర్ కూల్ నిర్ణయం తీసుకుంది. భక్తులు ఇక నడిచి వెళ్లే అవసరం లేకుండా కేంద్రం తాజా నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. భక్తులు ఇక నడిచి వెళ్లే అవసరం లేకుండా కేంద్రం యాదగిరి గుట్టకు రోప్ వే ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపింది. పర్వతమాల పరియోజన ప్రాజెక్ట్ లో భాగంగా గుట్టపైకి వెళ్లేందుకు రోప్ వే ఏర్పాటు చేసేందుకు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
యాదగిరి గుట్టతో పాటుగా రాష్ట్రంలో మరో మూడు చోట్ల రోప్ వేలను నిర్మించడానికి ఏర్పాటు చేయనున్నారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ - ఎన్ హెచ్ ఏఐ పరిధిలోని జాతీయ రహదారుల లాజిస్టిక్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ కు ఈ బాధ్యతలను అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి 1.1 కిలోమీటర్లు రోప్ వేను నిర్మించనున్నారు. అలానే నల్గొండ లోని హనుమకొండకు 1.2 కిలోమీటర్లు నాగార్జున కొండ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ వరకు 1.7 కిలోమీటర్లు , పెద్ద పల్లి జిల్లా మంథనిలోని రామగిరికోటకు 2.4 కిలోమీటర్ల మేర రోప్ వే ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది.
ఈ ప్రాజెక్ట్ కోసం అక్టోబర్ 21 వరకు ఈ బిడ్జ్ ల సమర్పణకు అవకాశం కల్పించారు. కేంద్రం దేశవ్యాప్తంగా 200 రోప్ వేలను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఉత్తరా ఖండ్‌లో రెండు, తెలంగాణలో 4 రోప్‌వేలకు పచ్చజెండా ఊపింది. ఈ రోప్ వేను ఏర్పాటు చెయ్యడం వల్ల భక్తులకు నేరుగా కొండపైకి చేరుకొనే వెసులు బాటు ఉంటుంది. నాగార్జునకొండకు కృష్ణానదిపై నుంచి రోప్‌వే ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్ట్ ను ఎట్టకేలకు రైల్వేశాఖ పట్టాలు ఎక్కించింది.