నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా మంగళవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు.
న్యూస్ లైన్ డెస్క్: నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా మంగళవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. నాంపల్లి లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.