హరిణి అనే యువతి కాలిపై నిప్పు రవ్వలు పడి గాయాలయ్యాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా.. జనాల మధ్యలో టపాసులు కాల్చకూడదని చెప్పాల్సిన పోలీసులే వేడుకల్లో పాల్గొని కేక్ కటింగ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: సోమావారం మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు కావడంతో వరంగల్ వద్ద వేడుకలు జరిపారు. సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఏసీపీ నందిరామ్ నాయక్ కేక్ కట్ చేశారు. ఆయనతో పాటు సీఐ, సిబ్బంది కూడా పాల్గొన్నారు.
అయితే, కాశిబుగ్గ జంక్షన్ వద్ద సురేఖ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జనాల మధ్యనే టపాసులు ఆమె అనుచరులు కాల్చారు. దీంతో హరిణి అనే యువతి కాలిపై నిప్పు రవ్వలు పడి గాయాలయ్యాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా.. జనాల మధ్యలో టపాసులు కాల్చకూడదని చెప్పాల్సిన పోలీసులే వేడుకల్లో పాల్గొని కేక్ కటింగ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.