సినీ నటి హేమకు డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చింది.
న్యూస్ లైన్ డెస్క్: సినీ నటి హేమకు డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చింది. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడటంతో నటి హేమ 'మూవీ ఆర్టిస్టు అసోసియేషన్' ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే సోమవారం ఆమె 'మా' అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి తనకు లేఖ అందించారు. షోకాజు నోటీసు ఇవ్వకుండా తనని మా సభ్యత్వం నుంచి తొలగించడం అన్యాయం అని హేమ వాపోయారు. దాంతో డ్రగ్స్ టెస్ట్ రిపోర్టులో తనకు నెగటివ్ వచ్చిందని, మళ్లీ 'మా'లో తన సభ్యత్వాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు. మా సభ్యులు అందరు తనకి సపోర్ట్ చేయాలని హేమ కోరారు.