Nagarjuna: చైతన్య- శోభిత పెళ్లిపై నాగ్ ఏమన్నారంటే?

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థాన్ని తాము ముందుగా ప్లాన్ చేసుకోలేదని అక్కినేని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.


Published Aug 11, 2024 09:16:52 AM
postImages/2024-08-11/1723385749_nagarjuna.PNG

న్యూస్ లైన్ సినిమా: మొన్నటి వరకు చాటుమాటుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన నాగచైతన్య, శోభిత నిశ్చితార్థంతో ఒక్కటయ్యారు. నాగార్జున ఇంట్లో జరిగిన ఈ వేడుకకు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వీరిద్దరి నిశ్చితార్థం వేడుకను అధికారికంగా ప్రకటిస్తూ ఎంగేజ్మెంట్ ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థాన్ని తాము ముందుగా ప్లాన్ చేసుకోలేదని అక్కినేని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక వీరి పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విడాకుల తర్వాత చైతన్య చాలా బాధపడ్డారు. కానీ తన బాధను ఎవరితోనూ పంచుకోలేదని అన్నారు. కానీ ఇప్పుడు తన తనయుడు తిరిగి సంతోషంగా ఉండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

'ఎంగేజ్మెంట్ చేసుకోవాలని వాళ్లిద్దరూ అప్పటికప్పుడు అనుకున్నారు. దీంతో వెంటనే చేసేశామని నాగ్ అన్నారు. పెళ్లికి మాత్రం అలా కాదు. ప్రస్తుతం ఇద్దరూ వారి కెరీర్‌లో బిజీగా ఉన్నారు. దానికి చాలా సమయం పడుతుంది' అని నాగార్జున స్పష్టం చేశారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హరోయిన్‌గా నటిస్తోంది. కొన్ని రోజులుగా చైతన్య, శోభితా ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ నెట్టింట వైరలయ్యాయి. ఈ క్రమంలోనే ఇద్దరికి సంబంధించిన ఫోటోస్ కూడా నెట్టింట వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరిస్తుంది. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ గురువారం ఆగస్ట్ 8న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.

newsline-whatsapp-channel
Tags : nagarjuna tollywood marraige nagachaitanya sobhita-dhulipala

Related Articles