సీనియర్ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు.
న్యూస్ లైన్ డెస్క్: సీనియర్ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరినట్లు సన్నిహితులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురౌతూ వస్తున్నారు. అస్వస్థతకు గురికావడంతో నిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయనకు ఏమైంది, ఎందుకోసం హాస్పిటల్లో చేరారు అనేది తెలియాల్సి ఉంది. ఆర్ నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారని విషయం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పీపుల్స్ స్టార్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.