Surya: షూటింగ్‌లో గాయపడ్డ హీరో సూర్య

భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ సందర్భంగా సూర్యపై రోప్ కెమెరా వచ్చి పడింది. ఈ ప్రమాదంలో హీరో సూర్య గాయపడ్డాడు.


Published Aug 10, 2024 07:29:12 AM
postImages/2024-08-09/1723212636_kanguva.PNG

న్యూస్ లైన్ సినిమా: కొలీవుడ్ స్టార్ హీరో సూర్యకు షూటింగ్‌లో గాయాలు అయిన్నట్లు తెలుస్తోంది. సూర్య ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'కంగువ'. ఇటీవలే ఈ మూవీ థాయ్ లాండ్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చింది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. అయితే భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ సందర్భంగా సూర్యపై రోప్ కెమెరా వచ్చి పడింది. ఈ ప్రమాదంలో హీరో సూర్య గాయపడ్డాడు. దీంతో షూటింగ్‌ను ఆపేసిన యూనిట్ సభ్యులు సూర్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో సినిమా నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. నిర్మాత రాజశేఖర్ పాండియన్ ఈ విషయాని సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపారు. సూర్య శ్రేయస్సు గురించి అభిమానులకు ఆయన భరోసా ఇచ్చారు.

newsline-whatsapp-channel
Tags : tollywood movie-news hero- surya-

Related Articles