తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని వరుణ్ తేజ్ దంపతులు దర్శించుకున్నారు.
న్యూస్ లైన్ సినిమా: వివాహం అనంతరం మొదటి సారి ప్రముఖ సినీ నటుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి తిరుమలకు వెళ్లారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని వరుణ్ తేజ్ దంపతులు దర్శించుకున్నారు. మంగళవారం తిరుమలకు చేరుకున్నా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు రాత్రి తిరుమలలో బస చేసశారు. ఇక బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఇక ఆలయం వెలులప వరుణ్, లావణ్య త్రిపాఠిలను చూసిన భక్తులు అభిమానాలు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపరు.
ఆలయ బయట వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ వివాహం అనంతరం శ్రీవారి దర్శనానికి రావడం ఇదే మొదటి సారి. షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి రావడానికి ఇన్ని రోజులు పట్టింది. కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వామి వారి చెంత సినిమాల గురించి అడగవద్దని వరుణ్, మీడియా ప్రతినిధులకు తెలిపారు. గతేడాది లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనేక సినిమాల్లో వరణ్- లావణ్య జంటగా నటించారు.