bigboss8 : అసలు ఎందుకొచ్చారు సార్ ..బిగ్ బాస్ లోకి !

ఈ బిగ్ బాస్ కి వచ్చాం అన్నట్లే ఉంటున్నారు. మాట మంతి పక్కనపెడితే ..ఉలుకు లేదు పలుకు లేదు. అందుకే వీరిని మాత్రం భలే ట్రోల్స్ చేస్తున్నారు జనాలు. ఎందుకొచ్చారు సార్ మీరు అంటూ తెగ సెటైర్లు వేస్తున్నారు.


Published Sep 06, 2024 11:56:00 AM
postImages/2024-09-06/1725604193_Screenshot20240906095233.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ అంటేనే లైమ్ లైట్ ..ఫేమ్ కావాలనుకునేవారు మాత్రమే ఇక్కడ సస్టైన్ అవ్వగలరు. డ్రామా పండాలి..డ్రామా చెయ్యాలి. అన్ని ఉంటేనే ఇక్కడ వారాలు వారాలు ఉండగలం ...కప్ గెలుచుకొని ఇంటికి వెళ్లగలం. కాని ఇప్పుడు బిగ్ బాస్ 8 లో మాత్రం కొంతమంది ...ఎందుకు రా  ఈ బిగ్ బాస్ కి వచ్చాం అన్నట్లే ఉంటున్నారు. మాట మంతి పక్కనపెడితే ..ఉలుకు లేదు పలుకు లేదు. అందుకే వీరిని మాత్రం భలే ట్రోల్స్ చేస్తున్నారు జనాలు. ఎందుకొచ్చారు సార్ మీరు అంటూ తెగ సెటైర్లు వేస్తున్నారు.


 బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ఈ ఆదివారం స్టార్ట్ అయ్యింది.  ఈ సారి కంటెస్టెంట్స్  రావడం రావడం గొడవలతో మొదలుపెట్టారు. గొడవపడితే కెమరా అప్లాజ్ దొరుకుతుంది. ఇదే స్ట్రాటజీ . కొంతమంది సింపతీ..మరికొంతమంది టచ్ మీ నాట్ లాగా ఉన్నారు. చాలా వరకు కెమెరాల ముందు యాక్టింగ్‌ చేస్తున్నట్టుగానే ఉందని నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


ట్రోలర్స్ కి మాత్రం మన బెజవాడ బేబక్క, ఆదిత్య ఓం, ఆఫ్రీది, లాంటి వారు బిగ్ బాస్ కు ఎందుకు వచ్చారో కూడా తెలీదు . మిగిలిన వాళ్లంతా ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్ లు ఇస్తున్నారు వీళ్లు మాత్రం యాక్ట్ చెయ్యడం లేదు అలా అని జెన్యూన్ గా ఉండడం లేదు. ఆదిత్య అయితే ఎప్పుడు 90 వేసినట్టే ఉంటాడు. చాలా నిద్రలో ఉన్నట్టే ఉన్నారు.


మన బేబక్క కూడా జనాలు లైట్ తీసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో ఆమె చేసే రచ్చ వేరే లెవల్‌లో ఉంటుంది. ఇక్కడ మాత్రం మేడం ఐటమ్ అయిపోతుంది. కామెడీ పీస్ లాగా .కుళ్లు జోకులు, సెటైర్లు పేలుస్తూ కనిపిస్తుంది.
శేఖర్ బాషా కూడా కాస్త లైట్ గానే ఉన్నాడు. ఎంతో వాగే శేఖర్ బాషా కు ఏం మాట్లాడాలో తెలీడం లేదు. పెద్దగా ఓపెన్ కావడం లేదు. ఇంకా నాలుగు రోజులేగా  అయ్యింది చూడాలి ఓపెన్ అవుతాడో లేదో.


 అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. కాకపోతే జెన్యూన్‌గా ఉన్నాడనే సింపతి వర్కౌట్‌ అవుతుంది. ఇక నాగమణికంఠ ఇంకా ఫ్యామిలీ సింపతీని కంటిన్యూచేస్తున్నాడు. పృథ్వీరాజ్‌ కూడా డల్‌గానే కనిపిస్తున్నాడు. అభయ్‌ నవీన్‌ కూడా గేమ్‌లో కాస్త తడబడుతున్నారు.ఇక మొదటి వారం శేఖర్ బాషా, బేబక్క, సోనియా ఆకుల, ప్రేరణ, నాగ మణికంఠ, విష్ణుప్రియ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు బలికాబోతున్నారో చూద్దాం.

newsline-whatsapp-channel
Tags : trolling adithya bigboss8 naga-manikanta bejawada-bebakka

Related Articles