Ntr Allu arjun:అల్లు, నందమూరి కాంబోలో సరికొత్త మూవీ.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు, నందమూరి ఫ్యామిలీలు ఒక ప్రత్యేకమైనటువంటి క్రెడిట్ సంపాదించుకున్నాయి. ఇందులో నందమూరి ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ పాన్


Published Aug 06, 2024 09:11:00 PM
postImages/2024-08-06/1722957803_jrntr.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు, నందమూరి ఫ్యామిలీలు ఒక ప్రత్యేకమైనటువంటి క్రెడిట్ సంపాదించుకున్నాయి. ఇందులో నందమూరి ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎదిగారు.  అలాగే అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నారు.. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు మళ్లీ పాన్ఇండియా స్థాయిలో  సక్సెస్ సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు.

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ "దేవర" సినిమాతో మన ముందుకు రాబోతుండగా, అల్లు అర్జున్ పుష్ప2తో  మన ముందుకు రాబోతున్నారు. అలా ఇద్దరు హీరోలు   ఎంతో క్రేజ్ ను సంపాదించుకొని ఇండస్ట్రీలో  దూసుకుపోతున్నారు. అలాంటి వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు బిగ్ స్క్రీన్ పై కలిసి నటించలేదు.

 ఏదైనా సినిమా ఫంక్షన్లు లేదా ఇతర ప్రోగ్రామ్స్ లో ఒకే ఫ్రేమ్ లో కనిపించిన సినిమా పరంగా మాత్రం ఇద్దరు  ఎక్కడ కలిసి నటించిన దాఖలాలు అయితే లేవు. ఈ ఇద్దరు హీరోలు మంచి ఫ్రెండ్స్.  అలాగే ఒకరికొకరు బావ బావ అంటూ పిలుచుకుంటారు.  అలాంటి ఈ పాన్ ఇండియా స్టార్ల కాంబినేషన్ లో  సినిమా వస్తే బాగుంటుందని చాలామంది భావించారు. వీరిద్దరి కాంబోలో సినిమా కూడా రాబోతుందట.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వస్తున్న  ఎన్టీఆర్ బావమరిది 'ఆయ్' సినిమా త్వరలో రాబోతోంది.  అయితే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ రాబోతున్నట్టు సమాచారం.  ఈ విధంగా ఇద్దరి కాంబోలో కూడా చిత్రం చేస్తే బాగుంటుందని  అభిమానులు భావిస్తున్నారట.  ఒకవేళ ఇది ఓకే అయ్యి ముందుకు వెళితే మాత్రం ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr allu-arjun narne-nithin aye-movie

Related Articles