జయలలిత అందానికి మెచ్చి ముంబై ఓ ఫ్లాట్ కూడా రాసిచ్చారట. అంతేకాదు అమెరికాలో ఓ మ్యాన్షన్ రాసిస్తే జయలలిత ఏం చేశారో తెలుసా
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జయలలిత ఈ పేరు తెలియని వారుంటారా..అందమే ఆవిడ జీవితానికి శాపం ..పెళ్లి జరిగినా..పిల్లలు , ఫ్యామిలీ లేదు. ఈ మధ్య సీరియల్స్ లో కూడా పెద్దగా నటించడం లేదు. ఒకప్పుడు 90 ,80 ల్లో జయలలిత హవానే నడిచింది. రీసెంట్ గా తన గురించి సంచలన విషయాలు బయటపెట్టారు . అంబానీ తో తన పరిచయాన్ని బయటపెట్టారు.
శరత్ బాబును ప్రేమించింది..కాని ఆ ప్రేమ పెళ్లి వరకు రాలేదు. కాని తనను ఎంతో మంది ప్రేమించారట. ఎంతో మందిలో ధీరూ భాయ్ అంబానీ ఒకరు. జయలలిత అందానికి మెచ్చి ముంబై ఓ ఫ్లాట్ కూడా రాసిచ్చారట. అంతేకాదు అమెరికాలో ఓ మ్యాన్షన్ రాసిస్తే జయలలిత ఏం చేశారో తెలుసా ...పరాయి సొమ్ము మనకెందుకని తిరిగి ఇచ్చేశారట. అంతేకాదు ..తన జోలికి రావద్దని సాధరంగా చెప్పి తప్పించుకున్నారట. ఈ విషయం జయలలితనే ..కరాటే కళ్యాణి ఇంటర్వ్యూలో చెప్పింది.
అయితే అలా ఒప్పుకుంటే తన జీవితం మరోలా ఉండేదని ...కాని తను ప్రేమ , పెళ్లి పిల్లలు ఊహించుకుంటే అంబానీ నుంచి అలాంటివి కాకుండా నా అందాన్ని మాత్రమే ఆరాధించాలనుకున్నారని ..కాని నో చెప్పాక ఇక ఇబ్బందిపెట్టలేదని తెలిపారు. ఇక ఈ జీవితానికి ..పెళ్లి , ప్రేమ , ఫ్యామిలీ రాసి లేవని బాధపడ్డారు.