Ananth: అనంత్ హనీమూన్..ఒక్క రాత్రికి రిసార్ట్ ధరతో ఓ ఫ్యామిలీ సెట్ అవుతుంది.!

రాధిక మర్చంట్ అనంత్ అంబానీ పెళ్లి జూలై 12  తేదీన ముంబై నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ పెళ్లికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. ఈ వివాహం అనేది ప్రపంచం


Published Aug 10, 2024 07:40:42 AM
postImages/2024-08-10/1723256879_ananthambanihoneymoon.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాధిక మర్చంట్ అనంత్ అంబానీ పెళ్లి జూలై 12  తేదీన ముంబై నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ పెళ్లికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. ఈ వివాహం అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా పేరుపొందింది. అలాంటి అనంత్ రాధిక మర్చంట్ వివాహం సంబంధించి  ఇప్పటికి అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇదే తరుణంలో అనంత్ మరియు రాధిక  హనీమూన్ కు సంబంధించి కూడా ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారట. అయితే వీరు ఎక్కడికి హనీమునికి  వెళ్లారు, వెళ్లిన హోటల్ ధర ఎంత, అనే వివరాలు చూద్దాం. అయితే ఈ జంట హనీమూన్ కోసం పారిస్ నుంచి కోస్టారికాకు వెళ్లారట. ఒక ఖరీదు అయినటువంటి రిసార్ట్ లో  వీరు హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది.

 వీరు బస చేసే రిసార్ట్ లోని ఒక్కో గదికి ఒక్క రోజుకు ఎంత ఇస్తారో తెలిస్తే షాక్ అయిపోవడం ఖాయం. వారు ఒక్కరోజు చెల్లించే డబ్బుతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవిత కాలం బ్రతుకుతుంది. కోస్టారికాలోని గ్వనా కాస్టు ప్రాంతంలో ఉన్న  కాసా లాస్ ఒలాస్ ఫోర్  సీజన్ సు రిసార్ట్ లో అనంత్ అంబానీ రాధిక మర్చంట్ బస చేశారట. ఈ యొక్క విలాసవంతమైన రిసార్ట్ లో ఒక్క రాత్రి బస చేయాలంటే 30 వేల డాలర్లు ఇవ్వాలని  తెలుస్తోంది. అంటే ఒక్క రాత్రికి 25 లక్షలు అన్నమాట.

ఈ రిసార్ట్ లో అధునాతనమైనటువంటి సౌకర్యాలు, అద్భుతమైన వాతావరణం ఉంటుందట.  ఇది 18 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం కలిగి ఉండి తొమ్మిది బెడ్ రూమ్ లు ఉంటాయట. 100 అడుగుల స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందట. అద్భుతమైన సౌకర్యాలు కలిగినటువంటి ఈ రిసార్ట్  ప్రకృతి రమణీయం ఉట్టిపడేలా ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఇదే రిసార్ట్ లో అనంత్ అంబానీ రాధిక మర్చంట్ లు వారి హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ananth-ambani mukesh-ambani radhika-merchant ananth-honeymoon

Related Articles