Anushka: అనుష్క పెళ్లి ఫిక్స్ .. ఎవరితో అంటే.?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో, హీరోయిన్లు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రభాస్. హీరోయిన్ల విషయానికొస్తే అనుష్క శెట్టి, త్రిష  నాలుగు పదుల వయసు దాటి ఐదు పదుల వయసులోకి ఎంట్రీ ఇస్తున్నా కానీ పెళ్లిపై ఊసేత్తడం లేదు. దీంతో చాలామంది వీరి పెళ్లిళ్ల విషయంలో అనేక వార్తలు రాస్తూ వస్తున్నారు.  అనుష్క పెళ్లి విషయంలో కూడా అనేక వార్తలు వినిపించాయి. కానీ ఏ వార్త కూడా నిజం కాలేదు.  కానీ తాజాగా  అనుష్కకు ఆ వ్యక్తితో పెళ్లి  కాబోతుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.


Published Jul 25, 2024 07:30:00 PM
postImages/2024-07-25/1721914451_anu.jpg

న్యూస్ లైన్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో, హీరోయిన్లు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రభాస్. హీరోయిన్ల విషయానికొస్తే అనుష్క శెట్టి, త్రిష  నాలుగు పదుల వయసు దాటి ఐదు పదుల వయసులోకి ఎంట్రీ ఇస్తున్నా కానీ పెళ్లిపై ఊసేత్తడం లేదు. దీంతో చాలామంది వీరి పెళ్లిళ్ల విషయంలో అనేక వార్తలు రాస్తూ వస్తున్నారు.  

అనుష్క పెళ్లి విషయంలో కూడా అనేక వార్తలు వినిపించాయి. కానీ ఏ వార్త కూడా నిజం కాలేదు.  కానీ తాజాగా  అనుష్కకు ఆ వ్యక్తితో పెళ్లి  కాబోతుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం. అయితే అనుష్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.  ఈమె చివరగా తెలుగులో  నవీన్ పోలిశెట్టి సరసాన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" అనే సినిమాలో నటించింది.

ఆ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి చిత్రాలకు ఆమె  ఓకే చెప్పలేదు. అనుష్క ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాల దగ్గరికి వస్తోంది. ఎన్నో చిత్రాల్లో నటించిన ఈమె పెళ్లి విషయంలో మాత్రం వెనుకబడిపోయింది.  ఆ మధ్యకాలంలో ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని వీరే పెళ్లి చేసుకోబోతున్నారని అనేక కథనాలు వచ్చాయి. చివరికి వీరి మధ్య స్నేహం మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చారు.

అయితే అనుష్క ఓ నిర్మాతను వివాహం చేసుకోబోతోందని  అనేక వార్తలు వినిపించాయి.  అనుష్క ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటుందని నెట్టింటా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి అనుష్క ఫ్యామిలీ కూడా ఓకే చెప్పిందని, అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. పూర్తి క్లారిటీ రావాలంటే  కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu trisha anushka-shetty anushka-marraige miss-shetty-mister-polishetty naveen-polishetty

Related Articles