గద్దర్ పోరాట స్ఫూర్తిని మరచిపోలేమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
న్యూస్ లైన్ సినిమా: గద్దర్ పోరాట స్ఫూర్తిని మరచిపోలేమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం గద్దర్ వర్ధంతి సందర్భంగా పవన్ ఆయనకు నివాళులు అర్పించారు. పీడిత వర్గాల గొంతుకగా గద్దర్ నిలిచారని, తన పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా పోరాటాల్లో ఒక అధ్యాయాన్ని లిఖించారని ఆయన అన్నారు. తన తుది శ్వాస విడిచే వరకూ ప్రజా హక్కుల గురించే ఆలోచించారని తెలిపారు. నెల్లూరు టౌన్ హాల్లో గద్దర్‌ని తొలిసారి కలిసినప్పటి నుంచి ఆయన తుది శ్వాస విడిచే వరకూ ఆయనతో అనుబంధం కొనసాగిందని పవన్ తెలిపారు. గద్దర్ అనే పేరు తలచుకోగానే కాలికి గజ్జె కట్టి ఆడిపాడిన పాట గుర్తుకొస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.