పూర్వకాలంలో ఏ ఫుడ్ అయినా సరే చాలా శ్రేష్టంగా ఉండేది. ప్రస్తుతం ఉన్నటువంటి టేస్టీ ఫుడ్స్ అన్ని అప్పుడు లభించేవి కావు. సాధారణంగా పేద మధ్యతరగతి ప్రజలకైతే కనీసం రైస్ కూడా సరైన
న్యూస్ లైన్ డెస్క్: పూర్వకాలంలో ఏ ఫుడ్ అయినా సరే చాలా శ్రేష్టంగా ఉండేది. ప్రస్తుతం ఉన్నటువంటి టేస్టీ ఫుడ్స్ అన్ని అప్పుడు లభించేవి కావు. సాధారణంగా పేద మధ్యతరగతి ప్రజలకైతే కనీసం రైస్ కూడా సరైన సమయానికి తినేవారు కాదు. ఎక్కువగా చపాతీలు, గడకా లాంటివే తినేవారు. అందుకే వారు 100 సంవత్సరాలు బ్రతకగలిగారు. కానీ ప్రస్తుత కాలంలో మన ముందుకు వంద రుచులు కలిగిన, 100 రకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి.. అవి ఎంత మనకు అనుబాదులోకి వచ్చాయో అంతా తొందరగా మనం మరణించగలుగుతున్నాం.
అంతే స్పీడ్ గా వ్యాధులు కూడా వస్తున్నాయి. అలాంటి ఈ తరుణంలో ఏ ఫుడ్ కూడా మీతంగా కాకుండా అమితంగా తింటే తప్పనిసరిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పురుషులు కొంతమంది ఇంట్లో ఎంత మంచి కర్రీ ఉన్న పచ్చళ్ళు తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి నాలుకకు మంచి రుచిని ఇస్తాయి కాబట్టి ఎక్కువగా తింటూ ఉంటారు. పచ్చళ్ళు ఎక్కువగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయట. దీనికి ప్రధాన కారణం అందులో ఉండే మసాలాలు, నూనె, ఉప్పు అని అంటున్నారు. బిపి పేషెంట్లు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె సమస్యలు ఉన్నవారు పచ్చళ్ళు తినడం మంచిది కాదట.
ఎందుకంటే పచ్చళ్ళు ఎక్కువ కాలం నిలువ చేయడం వల్ల అవి తినగానే కడుపులో మంట, ఎసిడిటీ, డయాబెటిస్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయట. అంతేకాకుండా ఇందులో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీలపై ప్రభావం చూపుతోందట. అలాగే రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందట. ముఖ్యంగా పచ్చళ్లలో ఉండే అష్టమిఫ్రిడ్ కార్బన్ ఎక్కువగా ఉండటం వల్ల, పురుషుల యొక్క లైంగిక ఆసక్తిపై ప్రభావం చూపిస్తుందట. దీనివల్ల పురుషులు లైంగికంగా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవ్వలేరట. కాబట్టి పురుషులు ఎక్కువ పచ్చళ్ళు తినకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.