Balakrishna: మరో సారి ఓటీటీలో బాలయ్య...అన్ స్టాపబుల్ -3 త్వరలో !

ఓటీటీ ఆహాలో ఇప్పటికే అన్‌స్టాపబుల్‌కు సంబంధించి రెండు సీజన్‌లు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మరో సీజన్ స్టార్ట్ అవుతుంది.


Published Oct 01, 2024 09:33:00 PM
postImages/2024-10-01/1727798660_Balakrishna.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఓటీటీలో అన్ స్టాపబుల్ భలే క్లిక్ అయ్యంది. బాలయ్య తో హోస్టింగ్ అనే ఆలోచనే క్లిక్ అయ్యింది. ఎప్పుడు సీరియస్ ఎంగిల్ మాత్రమే చూసే బాలయ్య లో హోస్టింగ్ చేసే టాలెంట్ జనాలకు తెగ నచ్చేసింది. పంచులు , కౌంటర్లు అసల బాలయ్యతో మామూలుగా ఉండదు.తొలి తెలుగు ఓటీటీ ఆహాలో ఇప్పటికే అన్‌స్టాపబుల్‌కు సంబంధించి రెండు సీజన్‌లు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మరో సీజన్ స్టార్ట్ అవుతుంది.


సీజన్‌ 1,2లో పవన్‌ కల్యాణ్‌, మహేశ్ బాబు, ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరోలతో సందడి చేసిన బాలయ్య మూడో సీజన్‌తో కూడా స్టార్ సెలబ్రిటీలతో వినోదాన్ని అందించేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. అసలు బాలయ్య టైమింగ్ కు జనాలు ఫిదా అయిపోయారు. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం మొదలు ...వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి.-


మూడో సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌లో అతిథిగా మాలీవుడ్ స్టార్ యాక్టర్‌ దుల్కర్ సల్మాన్ హాజరవుతున్నారట. లక్కీ భాస్కర్‌ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ షోలో పాల్గొనబోతున్నారని టాక్‌. బాలకృష్ణ అండ్ టీం పై వచ్చే ఈ ఎపిసోడ్ ఆల్ రెడీ మేకింగ్ పూర్తయ్యిందట. దసరా కానుకగా ఈ ఎపిసోడ్ ను విడుదల చేయాలనుకుంటున్నారట ఈ రెండు రోజుల్లో అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందట.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu balakrishna dulkar-salman

Related Articles