Mokshagna:మోక్షజ్ఞ సినిమాపై బాలయ్య షాకింగ్ కామెంట్స్.. ఇప్పుడే అలా ఉన్నాడంటూ.?

నందమూరి ఫ్యామిలీలో మూడవ తరం హీరోలలో  ఇప్పటికే కళ్యాణ్ రామ్, బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. ఇదే తరుణంలో బాలకృష్ణ తనయుడు కూడా త్వరలో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత


Published Sep 02, 2024 03:15:36 PM
postImages/2024-09-02/1725270336_mok.jpg

న్యూస్ లైన్ డెస్క్: నందమూరి ఫ్యామిలీలో మూడవ తరం హీరోలలో  ఇప్పటికే కళ్యాణ్ రామ్, బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. ఇదే తరుణంలో బాలకృష్ణ తనయుడు కూడా త్వరలో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత సంవత్సర కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన వచ్చింది లేదు మనం చూసింది లేదు. ఈ తరుణంలో బాలకృష్ణ ఆయనకి యాక్టింగ్ స్కిల్స్ నేర్పించడం కోసం విదేశాలకు పంపారని ఈ మధ్యకాలంలోనే ఆయన యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుని మళ్ళీ స్వదేశానికి వచ్చారని తెలుస్తోంది.

ఇదే తరుణంలో మోక్షజ్ఞ  త్వరలోనే సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నారని కూడా అనేక వార్తలు వినిపిస్తున్నాయి.  గత మూడు నాలుగు నెలల నుంచి ఉత్కంఠ నెలకొని ఉన్న సందర్భంలో తాజాగా బాలకృష్ణ 50 ఇయర్స్ ఇండస్ట్రీ పూర్తి చేసుకున్న సందర్భంగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్లు చేశారు. ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.  కొంతకాలం నుంచి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ డైరెక్టర్  ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఎంట్రీ ఉంటుందని ఆల్మోస్ట్ ఆయన ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.

వీటన్నిటికీ చెక్ పెడుతూ తాజాగా బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.  మోక్షజ్ఞ కనీసం ఒక్క సినిమాలో కూడా చేయకముందే స్టార్ అయిపోయాడు. మేము ఎంతో కష్టపడితే కానీ స్టార్డం రాలేదు. నా కొడుకు మాత్రం చేయకుండానే ఈ విధంగా స్టార్ అయిపోయాడు.

ఆయన మొదటి సినిమా మరో మూడు నెలల్లో మొదలవుతుంది అంటూ బాలయ్య అప్డేట్ ఇచ్చారు.  అలాగే  ఎలాంటి కథ ద్వారా  ఇండస్ట్రీలోకి తీసుకురావాలో నాకు తెలుసు.  చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల ఫ్యూచర్ కోసం కలలు కనడం కాదు వాటిని నిజం చేయడం కోసం ప్రణాళికలు కూడా రచిస్తారు.  నేను కూడా అందరిలాగే మోక్షజ్ఞ ఎంట్రీ పై టెన్షన్ అనుభవించడం లేదు. ఎందుకంటే మోక్షజ్ఞకు ఆ టాలెంట్ ఉంది.  మోక్షజ్ఞ కోసం ఆరు స్క్రిప్టులు నా మైండ్ లో రెడీగా ఉన్నాయంటూ బాలకృష్ణ తెలియజేయడంతో నందమూరి అభిమానులంతా సంబరపడిపోతున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr balakrishna mokshagna kalyan-ram prashanth-varma

Related Articles