Big boss8:భారీ రెమ్యునరేషన్ ఆ కంటెస్టెంట్ కేనా?

బిగ్ బాస్ సీజన్ 8  ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారంతా చాలావరకు సోషల్ మీడియాలో అందరికీ తెలిసిన వారే. కానీ ఈసారి నాగార్జున వీరిని  ఎంటర్టైన్మెంట్


Published Sep 03, 2024 11:02:27 AM
postImages/2024-09-03/1725341547_bigboss8.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8  ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారంతా చాలావరకు సోషల్ మీడియాలో అందరికీ తెలిసిన వారే. కానీ ఈసారి నాగార్జున వీరిని  ఎంటర్టైన్మెంట్ లిమిట్ లెస్ గా వాడుతారని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 ఏ విధంగా అయితే టాప్ లెవెల్ రేటింగ్ సంపాదించిందో సీజన్ 8 అంతకుమించి వెళ్ళాలని బిగ్ బాస్ యాజమాన్యం చూస్తున్నట్టు తెలుస్తోంది.  దీనికోసం ఈ సీజన్ లో అనేక ట్విస్టులు  పెట్టనున్నారట. అంతేకాదు అంతకుముందున్న రూల్స్ కూడా చేంజ్ చేసి  బిగ్ బాస్ ను నడిపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ విధంగా లిమిట్ లెస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్న తరుణంలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లంతా ఏం చేయబోతున్నారని ఆసక్తికరంగా మారింది.  ఇదే తరుణంలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ ల గురించి కూడా అనేక వార్తలు బయట వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఉన్నటువంటి కంటెస్టెంట్లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

 నాగమణికంఠ వారానికి రూ:1.25 లక్షలు.

 బెజవాడ బేబక్క వారానికి రూ:1.30లక్షలు.

 పృథ్వీరాజ్ వారానికి రూ:1.50 లక్షలు 

 సోనియా ఆకుల వారానికి రూ:1.70 లక్షలు 

 నబిల్ ఆఫ్రిది వారానికి  రూ. 1.70 లక్షలు

 అభయ్ నవీన్ వారానికి రూ. 2లక్షలు.

 కిరాక్ సీతా వారానికి రూ. 2.20 లక్షలు.

 శేఖర్ భాషా వారానికి రూ:2.30 లక్షలు

 నైనిక వారానికి వారానికి రూ:2.30 లక్షలు

 ప్రేరణ వారానికి వారానికి రూ:2.50 లక్షలు

 యశ్మీ గౌడ వారానికి రూ. 2.50 లక్షలు.

 నిఖిల్ వారానికి రూ. 3లక్షలు.

 ఆదిత్య ఓం వారానికి రూ. 3లక్షలు.

 విష్ణుప్రియ వారానికి రూ. 3.70 లక్షలు.

 ఈ విధంగా హైయెస్ట్ రెమ్యునరేషన్ యాంకర్ విష్ణుప్రియకు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : news-line nagarjuna star-maa big-boos8 remnuretion vishnu-priya nainika

Related Articles