Big Boss8:ప్రారంభ తేదీ ఫిక్స్..ట్విస్ట్ ఏంటంటే.!

బిగ్ బాస్  రియాలిటీ షో ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని  తెలుగు ప్రజలు గత కొంతకాలం నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్ఫుల్ గా  పూర్తి


Published Aug 21, 2024 05:50:00 PM
postImages/2024-08-21/1724241353_bigboss8.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్  రియాలిటీ షో ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని  తెలుగు ప్రజలు గత కొంతకాలం నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్ఫుల్ గా  పూర్తి చేసినటువంటి ఈ షో, సీజన్ 8 చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని తెలుస్తోంది.  అలాంటి బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చే కంటెస్టెంట్లు వివిధ రంగాల నుంచి రాబోతున్నారట. అలాంటి బిగ్ బాస్ సీజన్ 8  ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అనే విషయాన్ని స్టార్ మా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా  బయట పెట్టేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

బిగ్ బాస్ సీజన్ 8లో కూడా నాగార్జున గారే హోస్ట్ గా చేస్తారట.  అయితే బిగ్ బాస్ సీజన్ 7లో ఉల్టా పల్టాగా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చినటువంటి నాగార్జున ఈసారి ఇంకా వెరైటీగా ఉంటుందని చెబుతున్నారు.  ఈసారి బిగ్ బాస్ సీజన్ ఫన్, ఎంటర్టైన్మెంట్ తో పాటు అనేక ట్విస్టులు ఉంటాయని ఆయన చెప్పకనే చెప్పేస్తున్నారు.  అయితే ఈ షోను సెప్టెంబర్ ఒకటో తేదీ సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభించబోతున్నామని స్టార్ మా క్యాప్షన్ పెట్టి విషయాన్ని వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి అక్కినేని నాగార్జున కమెడియన్ సత్యాతో రూపొందించినటువంటి ఒక స్పెషల్ ప్రోమో  అందరినీ ఆకట్టుకుంటుంది.  ఇందులో ఆయన లిమిటే లేదు అంటూ చెప్పే డైలాగ్ తో ఈ ప్రోమో స్టార్ట్ అవుతుంది.  దీంతో కమెడియన్ సత్య నాకు అన్నీ అన్ లిమిటెడ్ గా కావాలి అంటూ ఎంట్రీ ఇస్తాడు.

https://x.com/StarMaa/status/1826149675688177780?s=19

ఈ ప్రోమో గతంలోనే రిలీజ్ చేయగా తాజాగా మళ్లీ రివీల్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ఈసారి కంటెస్టెంట్ల విషయానికి వస్తే  ప్రముఖ జ్యోతిష్యుడు అయినటువంటి వేణు స్వామి, తేజస్విని గౌడ, ఇంద్రనీల్ వర్మ, యాంకర్ విష్ణు ప్రియ, సీరియల్ నటి పవిత్ర, రీతు చౌదరి, యాంకర్ అంజలి, కమెడియన్ అభినవ్ గోమాటం,  కామన్ వ్యక్తుల్లో  కుమారి ఆంటీ కంటెస్టెంట్ గా రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి వీరే ఫిక్స్ అవుతారా లేదంటే వేరే కంటెస్టెంట్లు వస్తారా అనేది సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : news-line nagarjuna venuswamy star-maa pallavi-prashanth bigboss8

Related Articles