బిగ్ బాస్ సీజన్8 ప్రారంభమై అప్పుడే వారం గడిచిపోయింది. ఈ సీజన్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లో అడుగు పెట్టారు. ఇందులో చాలామంది సినీ ఇండస్ట్రీలో ఉన్నవారే. ఇదే తరుణంలో బిగ్
న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్8 ప్రారంభమై అప్పుడే వారం గడిచిపోయింది. ఈ సీజన్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లో అడుగు పెట్టారు. ఇందులో చాలామంది సినీ ఇండస్ట్రీలో ఉన్నవారే. ఇదే తరుణంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన రెండు రోజుల తర్వాత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక అప్పుడే మొదలైన గొడవలు అలా సాగుతూ వస్తున్నాయి. ఇదే తరుణంలో నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్ ఉన్నారు. ఇందులో నాగ మణికంఠకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో నాగమణికంఠ విపరీతంగా ఎమోషనల్ అవుతూ నా బ్రతుకు వేస్ట్ నేను ఏదో అవుదామనుకుంటే నన్ను ఇలా చేశారంటూ చాలా ఏడ్చాడు.
నేను నా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను అని, నా తల్లి చనిపోతే కట్టే కట్టే ఎరుకొని దహన సంస్కారాలు చేశానని అన్నారు. మొత్తానికి పాపం మణికంఠ అనే విధంగా చేశాడని చెప్పవచ్చు. అయితే నాగమణికంఠ చెప్పిందంతా అబద్ధమని తన తండ్రి మరియు తన చెల్లి సోషల్ మీడియా వేదికగా చెప్పారు. కానీ ఆయనకు సపోర్ట్ చేయాలని అన్నారు. నేను నా భార్య బిడ్డ దగ్గరికి ఒక రేంజ్ లో వెళ్లాలని అనుకున్నారని ఎమోషనల్ అయ్యాడు. ఇదే తరుణంలో హౌస్ లో వారు నన్ను వెళ్ళగొట్టాలని చూస్తున్నారని, తన భార్యా నన్ను అమెరికా నుంచి వెళ్లగొట్టిందని, నా బిడ్డ నాకు తగ్గాలంటే ఇక్కడి నుంచి మంచి రేంజ్ లోకి వెళ్లాలని ఎమోషనల్ అయ్యాడు.
దీంతో చాలామంది నేటిజన్స్ సింపతి గేమ్ ఆడొద్దు అంటూ కామెంట్లు పెడుతూనే ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇదే తరుణంలో నాగమణికంఠకు సంబంధించిన పెళ్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో నాగమణికంఠ పెళ్లి కొడుకుగా మెరిసిపోతున్నాడు. ఇందులో తన భార్య కితకితలు సినిమాలో హీరోయిన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వీరి జోడి ఉందంటూ కొంతమంది నేటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా నాగమణికంఠ హౌస్ లో కొనసాగడం కోసం అనేక స్టంట్లు వేస్తున్నారని చెప్పవచ్చు.
https://www.instagram.com/reel/C_pK8FfJuR5/?igsh=M2t3b3hsZ2RsdDVl