Bigboss8:హౌస్ లోకి పాన్ ఇండియా హీరో..ఇక రచ్చ రచ్చే.!

బిగ్ బాస్  బుల్లితెర రియాలిటీ షోలో అత్యంత గుర్తింపు పొంది దూసుకుపోతున్న షో. అలాంటి ఈ బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకుని ఎనిమిదవ సీజన్లోకి కూడా అడుగుపెడుతోంది. ఈ


Published Sep 01, 2024 01:04:45 PM
postImages/2024-09-01/1725176085_nagarjuna.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్  బుల్లితెర రియాలిటీ షోలో అత్యంత గుర్తింపు పొంది దూసుకుపోతున్న షో. అలాంటి ఈ బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకుని ఎనిమిదవ సీజన్లోకి కూడా అడుగుపెడుతోంది. ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి చాలా అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్న కంటెస్టెంట్లు అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.  వారందరిని హోస్ట్ నాగార్జున సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఏడు గంటల సమయంలో హౌస్ లోకి ఆహ్వానం పలుకుతారట.

అయితే ఇప్పటికే ఈ హౌస్ లోకి ఆదిత్య ఓం, కిరాక్ సీత, యాంకర్ విష్ణు ప్రియ, నిఖిల్ మల్యాకల్, శేఖర్ భాష, యస్మి గౌడ, ప్రేరణ, పరమేశ్వర్, నైనిక, జబర్దస్త్ రాకేష్, న్యూస్ రీడర్ కళ్యాణి, మోడల్ రవితేజ, బెజవాడ బేబక్క, వేణు స్వామి, కుమారి ఆంటీ వంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. అసలు వీరు వస్తారా రారా అనే విషయం పక్కన పెడితే, ఈ పాన్ ఇండియా స్టార్ మాత్రం తప్పకుండా బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారని ప్రోమోలో కనిపిస్తోంది.

https://youtu.be/L9PS9di_BT0?si=ToCgFbHEC4S8itsG

ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే  ది గ్రేట్ స్టార్ రానా, ప్రస్తుతం బిగ్ బాస్ నుంచి విడుదలైన ప్రోమో ప్రకారం రానా హౌస్ లో కనీసం వారం రోజులైనా ఉంటారట, హీరోయిన్ నివేత థామస్, కూడా కొన్నాళ్లపాటు హౌసులో ఉంటుందట, వీళ్లతోపాటు  హీరో నాని కూడా హౌస్ లోకి రానున్నారని, పొన్నాల పాటు నాగార్జున పండ్ల మీద బయటకు వెళ్తే నాని వచ్చి హోస్ట్గా చేయాలని  ఈ ప్రోమోలో కనిపిస్తోంది. ఈ విధంగా ప్రోమో ను అత్యద్భుతంగా క్రియేట్ చేసి లాంచ్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో కంటెస్టెంట్లు ఎవరెవరా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : nagarjuna rana nivetha-thomas nani big-boos8 pallavi-prashanth

Related Articles