గీతూ రాయల్ సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తున్న పేరు. ఈమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి గీతూ రాయలు తాజాగా కన్నీరు మున్నీరుగా
న్యూస్ లైన్ డెస్క్: గీతూ రాయల్ సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తున్న పేరు. ఈమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి గీతూ రాయలు తాజాగా కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది . దీనికి ప్రధాన కారణం సొంత బిడ్డలాంటి పెంపుడు పిల్లి మరణించిందని దారుణంగా ఎమోషనల్ అవుతోంది. అయితే ఈ పిల్లి పిల్లకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నటువంటి ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ చాలా ఏడ్చింది.
గీతు రాయల్ తన సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా తన పెంపుడు పిల్లి అయినటువంటి ఓరియోను చూసుకుంటుంది. అలాంటి ఓరియో తాజాగా మరణించడంతో గీతూ రాయల్ తానులేని లోటును ఎవరు తీర్చలేరు అంటూ బోరుణ విలపించింది. 2021 డిసెంబర్ 13న ఓరియోను తన ఫ్యామిలీలో భాగం చేసుకుంది. ఈ సంవత్సరం జూలై 27న ఓరియో శాశ్వతంగా అందరిని వదిలి వెళ్ళిపోయింది. నా ఒరియో చాలా అమాయకమైనదని దానికి కనీసం ఎలా అరవాలో, కరవాలో కూడా తెలియదని అన్నది. రోజులాగే జూలై 27న ఉదయం 3.45 గంటలకు బయట వీధిలోకి వెళ్ళింది. 5.30 కల్లా ఇంటికి వచ్చేసింది. ఆరోజు మొత్తం ఇంటికి రాలేదు సాయంత్రం వరకు వెతుకుతూనే ఉన్నాం.
కానీ సెక్యూరిటీ నిర్లక్ష్యం వల్ల బయట ఉండే వీధి కుక్కలు మా కమ్యూనిటీ లోపలికి వచ్చి నా బిడ్డను వెంటాడి మరి చంపేసాయి. ఆ సమయంలో నా ఊరిలో ఎంత భయపడిందో పాపం అది ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఓరియో అంటే నాకు ప్రాణం దాన్ని వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అంటూ ఎమోషనల్ అయింది గీతు రాయల్. అయితే ఈ పిల్లి యొక్క దహన సంస్కారాలు నిర్వహిస్తూ దానికి సంబంధించిన వీడియో మరియు ఓరియో ఇంట్లో చేసే అల్లరి పనుల గురించి పూర్తిగా ఒక వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతుంది.