Suicide: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులకు గొంతు కోసుకున్న BRS నేత

ఇటువంటి ఘటనే మరొకటి జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులు తాళలేక పోలీసుల ముందే ఓ BRS నేత గొంతు కోసుకున్నాడు.


Published Aug 18, 2024 03:43:24 AM
postImages/2024-08-18/1723970222_berasatyanarayana.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత దాడులు ఎక్కువయ్యాయని ప్రతిపక్షాలు వాపోతున్నాయి. గడిచిన 8 నెలల్లోనే ఆడవారిపై జరిగిన అఘాయిత్యాలపై దాదాపు 1800 కేసులు నమోదైనట్లు పోలీసుల నివేదికలో తేలిందని మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ఆగడాలు కూడా మితిమీరి పోతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తాజగా, ఇటువంటి ఘటనే మరొకటి జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులు తాళలేక పోలీసుల ముందే ఓ BRS నేత గొంతు కోసుకున్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వేధింపులకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీపీ, నస్పూర్ మున్సిపల్ 21వ కౌన్సిలర్ బేర సత్యనారాయణ వాపోయారు. 

ప్రేమ్ సాగర్ రావు తనను వేధిస్తూ, పోలీసుల చేత తనపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని వెల్లడించారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లి స్టేషన్ ముందే కత్తితో గొంతు కోసుకున్నట్లు తెలుస్తోంది. సత్యనారాయణను కుటుంబ సభ్యులు మెడి లైఫ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : india-people ts-news brs congress crime congress-leader-harassments bera-satyanarayana

Related Articles