ఈ నెల 23న బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు
న్యూస్ లైన్ డెస్క్: ఈ నెల 23న బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా, ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలు జగనున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రసంగం చేయనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. ఇక 25న శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది.