Samantha: సమంత ప్రపోజ్ చేసిన రోజే.. శోభితతో చైతూ ఎంగేజ్ మెంట్

నాగచైతన్య,శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ తో ఈరోజుతో వీరి కథ సమాప్తం అయింది. ఇన్ని రోజులుగా ఎన్నో పుకార్లతో వీరి రిలేషన్ కొనసాగించిన ఈ జంటకి ఈ ఒక్క రోజుతో ముగింపు పలికారు కుటుంబ సభ్యులు.అయితే చాలా


Published Aug 08, 2024 06:13:58 AM
postImages/2024-08-08/1723113218_SAMANTHACHAITHANYASPECIALDAY.jpg

న్యూస్ లైన్ డెస్క్: నాగచైతన్య,శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ తో ఈరోజుతో వీరి కథ సమాప్తం అయింది. ఇన్ని రోజులుగా ఎన్నో పుకార్లతో వీరి రిలేషన్ కొనసాగించిన ఈ జంటకి ఈ ఒక్క రోజుతో ముగింపు పలికారు కుటుంబ సభ్యులు.అయితే చాలా రోజుల నుండి వీరి మధ్య రిలేషన్ ఉన్న సంగతి మనకు తెలిసింది. కానీ చాలా జాగ్రత్తగా ఎక్కడా కూడా వీరి రిలేషన్ ని బయట పడకుండా మెయింటైన్ చేశారు.

కానీ ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఏదో ఒక దగ్గర దొరికిపోక తప్పదు.. అలా వీరు కూడా చిన్న చిన్న తప్పులు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ విషయం పక్కన పెడితే.. ఈరోజుతో సమంత మీద ఉన్న పగని పూర్తిగా నాగచైతన్య తీర్చేసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ సమంత మీద నాగచైతన్యకు ఉన్న పగ ఏంటి..ఈ రోజుతో వాళ్ళిద్దరికీ ఉన్న లింక్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నాగచైతన్య శోభిత ధూళిపాలల నిశ్చితార్థం ఆగస్టు 8న 9:42 నిమిషాలకు జరిగింది. అయితే ఈ ఆగస్టు 8 సమంతకు నాగ చైతన్యకు విడదీయలేని అనుబంధం ఉందట. ఇక వీరి మధ్య ఉన్న బంధం ఏంటయ్యా అంటే.. చైతన్యకు సామ్ ఈ రోజునే అంటే ఆగస్టు 8వ తేదీనే తన ప్రేమని వ్యక్తపరిచిందట. అలా వీరిద్దరూ ఆగస్టు 8ని చాలా స్పెషల్ డే గా తమ లైఫ్ లో గుర్తుంచుకున్నారట.కానీ సమంత నాగచైతన్యకు దూరమయ్యాక ఈ స్పెషల్ డే కి ఎలాంటి అర్థం లేదు అని చెప్పుకోవచ్చు.

అందుకే ఏ రోజైతే సమంత తనకి ప్రపోజ్ చేసిందో అదే రోజున నాగచైతన్య తన జీవితంలోకి మరో అమ్మాయిని ఆహ్వానించి సమంత పై ఈ విధంగా పగ తీర్చుకున్నాడు అంటూ కొంతమంది నెటిజన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.ఇక నాగచైతన్య సినీ కెరియర్ చూస్తే.. ప్రస్తుతం ఆయన తండేల్ సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా నాగచైతన్య కెరియర్ ని డిసైడ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna samantha nagachaitanya tandel sobhita-dhulipala

Related Articles