ఎట్టకేలకు నాగచైతన్య తన లైఫ్ లో నుండి సమంతను పూర్తిగా దూరం చేసేసారు.సడన్గా శోభిత ధూళిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేశారు. ఇక ఈ విషయాన్ని అధికారికంగా తండ్రి నాగార్జున
న్యూస్ లైన్ డెస్క్: ఎట్టకేలకు నాగచైతన్య తన లైఫ్ లో నుండి సమంతను పూర్తిగా దూరం చేసేసారు.సడన్గా శోభిత ధూళిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేశారు. ఇక ఈ విషయాన్ని అధికారికంగా తండ్రి నాగార్జున ప్రకటించేశారు. త్వరలోనే వీరిద్దరి పెళ్ళికి ముహూర్తాలు కూడా పెడుతున్నారు. అయితే వీరి పెళ్లి కూడా త్వరలో జరగబోతుంది అనుకునే వేళ వీరిద్దరికి సంబంధించిన ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇన్ని రోజులుగా వీరిపై వినిపించిన ఊహగానాలన్నీ నిజమే అని మరొకసారి జనాలు నెమరు వేసుకుంటున్నారు.
అయితే తాజాగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో వీరి ప్రేమ చిగురించింది ఆ హీరోయిన్ వల్లనే అంటూ కొంతమంది సినీ ప్రియులు మాట్లాడుకుంటున్నారు.. మరి ఇంతకీ శోభిత నాగచైతన్య ల మధ్య ప్రేమ చిగురించడానికి కారణమైన ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..ఆమె ఎవరో కాదు యార్లగడ్డ సుప్రియ.. నాగార్జున మేనకోడలు సుప్రియ వీరిద్దరి ప్రేమకు కారణమైందట.ఎందుకంటే శోభిత ధూళిపాల గూఢచారి సినిమాలో నటించిన సమయంలో సుప్రియ కూడా అందులో కీలకపాత్రలో నటించింది.
అయితే ఇదే టైంలో వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా అప్పుడప్పుడు సుప్రియ ఇంటికి శోభిత వస్తూ ఉండేదట.అలా వచ్చిన సమయంలో నాగచైతన్యతో శోభిత కు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అలా ఫ్రెండ్షిప్ కాస్త డేట్ చేసే వరకు వచ్చింది. ఇక ఆ టైంలోనే వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను సమంత కూడా పసిగట్టి మీ ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తోందని ఇంట్లో రచ్చ రచ్చ చేసిందట. కానీ చైతన్య మాత్రం అలాంటిదేమీ లేదు జస్ట్ ఫ్రెండ్స్ అని బుకాయించేసారట. కానీ గొడవ కాస్త పెద్దదై ఇద్దరు విడాకులకు కారణమైంది.
అలా ఒకరకంగా శోభిత కూడా వీరి విడాకులకు రీజన్ అనేలా ఇప్పుడు వీరి ఎంగేజ్మెంట్ ఉదాహరణగా కొంతమంది సమంత అభిమానులు భావిస్తున్నారు.అలా శోభిత చైతన్యల తొలి పరిచయం సుప్రియ కారణంగానే జరిగినట్టు తెలుస్తోంది. ఒకరకంగా వీళ్ళిద్దరి పెళ్ళికి యార్లగడ్డ సుప్రియ నే కారణమైందని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నాగచైతన్య శోభిత ధూళిపాలతో నైనా జీవితాంతం కలిసి ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు