సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ సమావేశం జరగనుంది.
న్యూస్ లైన్ డెస్క్: సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశలపై చర్చించే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ, రైతు బంధు, రేషన్ కార్డు, హెల్త్ కార్డుపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో పూర్తి స్థాయి రుణమాఫీ కాకపోవడంతో ప్రభుత్వం జిల్లా వ్యవసాయ అధికారులకు కీలక సూచనలు చేసింది. జిల్లాల్లో రుణమాఫీ కానీ రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించింది.