దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటులో కీలకమైన 'వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్' రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులకు సూచనలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటులో కీలకమైన 'వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్' రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులకు సూచనలు చేశారు. రైల్వేశాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్, ఇతర అధికారులు సోమవారం సాయంత్రం అసెంబ్లీ విరామంలో సీఎం రేవంత్ ఆయన కార్యాలయంలో కలిసి, వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్‌ను ప్రెజెంట్ చేశారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా మొత్తం 145 కిలోమీటర్ల మేర సుమారు రూ.3500 కోట్లతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు.
'వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్' ప్రణాళికల్ని వడివడిగా పూర్తిచేసి, పనులు చేపట్టే దిశగా రైల్వే శాఖకు సహకరించాలని ఆర్ అండ్ బీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి వాకిటి, నారాయణపేట ఎమ్మెల్యే ప్రణిక రెడ్డి, రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన తదితరులు పాల్గొన్నారు.