నిజానికి సిగరెట్ అలవాటున్న ఎవ్వరైనా అలవాటు చేసుకోవడం చాలా ఈజీ . కాని వదిలించుకోవడానికి మాత్రం తలకిందులుగా తపస్సు చెయ్యాలి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మందైనా తాగొచ్చు కాని సిగరెట్ తాగకూడదు..ఇది బయట జనాల టాక్. ఎందుకంటే తాగితే ఒక్కడి ఆరోగ్యమే పోతుంది. సిగరెట్ మాత్రం తనతో చుట్టుప్రక్కల ఉన్నవారందరి ఆరోగ్యం పోతుంది. కాబట్టి జాగ్రత్తలు అవసరమే. నిజానికి సిగరెట్ అలవాటున్న ఎవ్వరైనా అలవాటు చేసుకోవడం చాలా ఈజీ . కాని వదిలించుకోవడానికి మాత్రం తలకిందులుగా తపస్సు చెయ్యాలి.
ధూమపానానికి దూరం కావాలని ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తి తన తలను ఒక పంజరంలో బంధించుకున్నాడు. ఎలా అయినా సిగరెట్ తాగకుండా ఉండడానికి విశ్వప్రయత్నాలు చేసి కుదరక ఇక ఈ పధ్ధతిని సెలక్ట్ చేసుకున్నాడు. తుర్కియే కి చెందిన ఇబ్రహీం యూసెల్ అనే వ్యక్తి తన తలను ఓ కేజ్ లో బంధించుకున్నాడు. ఇలా చాలా రోజులుగా చేస్తున్నారు.ప్రతి రోజూ ఉదయం తన తలను అందులో పెట్టి లాక్ చేసుకుంటున్నాడు. లాక్ చేసిన వెంటనే తాళపు చెవిని కుటుంబ సభ్యులకు ఇస్తున్నాడు. 26 యేళ్లుగా ఇతనికి ఈ సిగరెట్ అలవాటు ఉంది. అయితే హెల్మెట్ వల్ల చాలా వరకు సిగరెట్ తాగడం తగ్గిందని అంటున్నారు.
అయితే ఈ పంజరాన్ని తనకు తానే తయారుచేసుకున్నాడట . 40 మీటర్ల రాగి తీగ తెచ్చుకొని ఇంట్లోనే సొంతంగా రూపొందించాడు. సిగరెట్ తాగడానికి ఏమాత్రం అవకాశం లేదని నిర్ధారించుకున్న తర్వాత దీనిని ఉపయోగించాడు. ఆరోగ్యం కోసం తన భర్త చాలా కష్టపడుతున్నారని అతడి భార్య చెప్పింది. స్ట్రా సాయంతో మంచినీటిని తాగుతున్నాడు.