Instagram: రష్మిక సమంత మధ్య పోటీ..ఇన్స్టాలో టాప్ 5లో ఉన్న హీరోయిన్స్ వీళ్ళే.?

ఒకప్పుడు హీరో, హీరోయిన్స్ కు ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. వారంతా వారి అభిమాన హీరో, హీరోయిన్ ఎక్కడ కనిపిస్తుందా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసేవారు. ఒక్కసారి వారితో ఫోటో దిగితే చాలు, మాట్లాడితే 


Published Aug 09, 2024 09:09:40 AM
postImages/2024-08-09/1723174780_samrashmikapooja.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు హీరో, హీరోయిన్స్ కు ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. వారంతా వారి అభిమాన హీరో, హీరోయిన్ ఎక్కడ కనిపిస్తుందా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసేవారు. ఒక్కసారి వారితో ఫోటో దిగితే చాలు, మాట్లాడితే చాలు అదే జీవితానికి ధన్యమని అనుకునేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. హీరో హీరోయిన్స్ ని డైరెక్ట్ గా  కలవకుండా సోషల్ మీడియా ద్వారా  కాంటాక్ట్ అవుతున్నారు. వారి అభిమాన హీరోయిన్ హీరో ఏదైనా పోస్ట్ పెడితే దానికి లైక్స్, షేర్స్ చేసి వారి అభిమానాన్ని చాటుతున్నారు.

అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను పెంచుకున్నటువంటి హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..  దక్షిణాది ఇండస్ట్రీలో  ఎంతోమంది టాప్ హీరోయిన్స్ ఉన్నారు. ఇందులో అత్యధికంగా  సోషల్ మీడియా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న హీరోయిన్స్ లిస్ట్ లో రష్మిక మందాన మొదటి స్థానంలో ఉన్నారు. ఈమె 43.9 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి అగ్రస్థానంలో నిలిచింది.

ఇక రష్మిక తర్వాత రెండవ స్థానంలో నిలిచింది  సమంత. ఒకప్పుడు రష్మిక కంటే టాప్ ప్లేస్ లో ఈమె ఉండేది. కానీ ఆ మధ్య సినిమాల్లో గ్యాప్ ఇవ్వడంతో ఈమె ఫాలోవర్స్ ను   పెంచుకోలేకపోయింది. సమంతాకు 35.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మూడవ స్థానంలో పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ గా, పేరు సంపాదించుకున్నా కానీ  సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది.

27.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక నాలుగవ స్థానంలో నిలిచింది కాజల్ అగర్వాల్. ఈమె పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తరగని అందంతో మరోసారి సినిమాల్లో దూసుకుపోతోంది. కాజల్ కు 26.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఐదవ స్థానంలో ఉంది మిల్క్ బ్యూటీ తమన్న.  ఈ ముద్దుగుమ్మకు 25.9 మిలియన్ల ఇన్స్టా ఫాలోవర్లను కలిగి ఉంది. ఈ విధంగా దక్షిణాదిలో టాప్ 5లో ఇన్స్టాలో ఫాలోవర్స్ ను కలిగి ఉన్న హీరోయిన్లలో వీరు మాత్రమే ఉన్నారు.

newsline-whatsapp-channel
Tags : kajal-aggarwal newslinetelugu samantha rashmika-mandanna pooja-hegde

Related Articles