చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోడిగుడ్లు, టమాటలతో దాడి చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోడిగుడ్లు, టమాటలతో దాడి చేశారు. 10 ఏళ్ల నుండి కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులని, కార్యకర్తలని గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. బుధవారం చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని షాబాద్ మండలానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది.
గత పది ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారిని గుర్తించకుండా.. బీఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకొని తిరుగుతున్నారని ఆగ్రహంతో వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముందు ధర్నా చేసి గో బ్యాక్ ఎమ్మెల్యే, గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది. తమకు న్యాయం చేసే అంత వరకు మేము వినేదిలేదంటూ.. మొండిగా డౌన్ డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే కాలే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటీవల ఎమ్మెల్యే కాలే యాదయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాలే మొదట కాంగ్రెస్లో ఉన్నారు.. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కార్ పై కోడిగుడ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు pic.twitter.com/yVcNNuRvIR — Telugu Scribe (@TeluguScribe) August 28, 2024