రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణ రోజురోజుకు నిర్లక్ష్యంగా మారుతోంది. విద్యార్థులకు పెట్టే ఆహారంలో ఎలుకలు, బల్లులు వస్తుంటే.. మరోవైపు హాస్టళ్లలోకి విషపూరిత పాములు రావడంతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు.
నల్గొండ - మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని నీలగిరి బాయ్స్ హాస్టల్ రూంలోకి పాము రావడంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు.
యూనివర్సిటీ ఆవరణలో గడ్డి, చెత్తాచెదారం, మురుగునీరు పేరుకుపోవడంతో విష సర్పాలు హాస్టల్లోకి వస్తున్నాయని అనేకమార్లు యూనివర్సిటీ యాజమాన్యానికి చెప్పిన పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.