Devara: దేవర నుంచి ‘దావుడి’ సాంగ్ విడుదల

ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘‘దావుడి’’ అంటూ సాగే పాటను విడుదల చేస్తూ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.


Published Sep 04, 2024 07:08:43 AM
postImages/2024-09-04/1725450192_jande.PNG

న్యూస్ లైన్ సినిమా: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘దేవర’. ఈ మూవీకి కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందు రానుంది. అయితే ఫస్ట్ పార్ట్ 2024 అక్టోబ‌ర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటీకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్‌కు రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మూడో పాటకు సంబంధించి మేకర్స్ ఆసక్తికర అప్‌డేట్ అందించారు.

ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘‘దావుడి’’ అంటూ సాగే పాటను విడుదల చేస్తూ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో తారక్‌, జాన్వీకపూర్‌ పోటీపడి మరీ డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. వారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సాంగ్‌‌ను విడుదల చేశారు. పక్క మాస్ అండ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తారక్ సొంత నిర్మణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ సంయక్తంగా నిర్మిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana jr-ntr tollywood movie-news devara janhvi-kapoor

Related Articles