Meena: ధనుష్,మీనాల రెండో పెళ్లి.. ఆ నటుడు ఏమన్నారంటే..?

ఒకప్పుడు గ్లామర్ బ్యూటీగా సౌత్ సినిమాల్లో తన గ్లామర్ తో వరుస అవకాశాలను అందుకున్న మీనా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అత్త అమ్మ వంటి పాత్రల్లో నటిస్తుంది. అయితే అలాంటి మీనా భర్త 2022లో చనిపోవడంతో 


Published Aug 02, 2024 06:06:52 AM
postImages/2024-08-02/1722596797_meena.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు గ్లామర్ బ్యూటీగా సౌత్ సినిమాల్లో తన గ్లామర్ తో వరుస అవకాశాలను అందుకున్న మీనా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అత్త అమ్మ వంటి పాత్రల్లో నటిస్తుంది. అయితే అలాంటి మీనా భర్త 2022లో చనిపోవడంతో అప్పటినుండి మీనా రెండో పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి.అయితే ఈ వార్తలపై మీనా క్లారిటీ ఇచ్చినా కూడా ఆగడం లేదు.

దాంతో చాలాసార్లు మీనా చట్టపరంగా చర్యలు తీసుకుంటానని కూడా బెదిరించింది. ఇక మీనా రెండో పెళ్లి విషయంలో వచ్చిన చెత్త వార్త ఏంటంటే.. మీనా నటుడు ధనుష్ ని రెండో పెళ్లి చేసుకోబోతుందని.. ప్రస్తుతం ధనుష్ భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. అలాగే మీనా భర్త చనిపోయి ఒంటరిగా ఉంటుంది.కాబట్టి వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకుంటారని కొంతమంది థంబ్ నెయిల్స్ సృష్టించి మరీ వార్తలు వైరల్ చేశారు.

ఈ వార్తలపై చాలామంది ఫైర్ అయ్యారు. అయితే తాజాగా ఈ విషయంలో  ఫైర్ అయ్యారు కోలీవుడ్ నటుడు శరత్ కుమార్.. ఆయన మాట్లాడుతూ.. చాలామంది యూట్యూబర్లు సెలబ్రిటీల పై చేసే రూమర్లకి అడ్డు అదుపు ఉండడం లేదు.వారి పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుంటూ పరువు తీస్తున్నారు. ఇక రీసెంట్ గా ధనుష్,మీనాలు పెళ్లి చేసుకోబోతున్నారనే  న్యూస్ వైరల్ చేశారు.

ధనుష్ కి 41 ఏళ్లయితే మీనాకి 47 ఏళ్లు.. అసలు వీరిద్దరి మధ్య ఇప్పటివరకు పరిచయం లేదు.అలాగే కలిసి కూడా నటించలేదు. అలాంటిది ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు రాయడం ఎంతవరకు సమంజసం. ఇలాంటి పుకార్లు రాసే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి.మీనాకు జరిగిన ఈ అన్యాయంలో ఆ యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని నేను గవర్నమెంట్ ని కోరుతున్నాను అంటూ శరత్ కుమార్ చెప్పారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu meena kollywood sarath-kumar dhanush vidya-sagar meena-second-marraige

Related Articles