ఐదు పదుల వయసు దాటిన రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోవడం లేదు. అయితే ఆయనకు నచ్చిన అమ్మాయి దొరకడం లేదో లేక పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదో తెలియడం లేదు కానీ పెళ్లికి
న్యూస్ లైన్ డెస్క్: ఐదు పదుల వయసు దాటిన రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోవడం లేదు. అయితే ఆయనకు నచ్చిన అమ్మాయి దొరకడం లేదో లేక పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదో తెలియడం లేదు కానీ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ మాత్రం చెప్పడం లేదు.అయితే రాహుల్ గాంధీ అప్పట్లో ఓ హీరోయిన్ ని ప్రేమించారట.కానీ ప్రస్తుతం ఆ హీరోయిన్ కి పెళ్లి అయిపోయింది.
మరి ఆ హీరోయిన్ పై ప్రేమతోనే ఇన్నాళ్లు పెళ్లికి దూరంగా ఉన్నారా.. భవిష్యత్తులో అయినా ఆయన పెళ్లి చేసుకుంటారా..ఇంతకీ రాహుల్ గాంధీ ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీకి పొలిటిషన్స్ కి దగ్గర సంబంధం ఉంటుంది. చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులను పెళ్లి చేసుకున్న వాళ్లు ఉన్నారు. అయితే అప్పట్లో బాలీవుడ్ లోని కపూర్ ఫ్యామిలీకి గాంధీ ఫ్యామిలీకి మద్య మంచి సత్సంబంధాలు ఉండేవట.
అలా ఇంధిరా గాంధీ తన కొడుకు రాజీవ్ గాంధీకి కపూర్ ఫ్యామిలి కి చెందిన హీరోయిన్ ని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుందట. కానీ అప్పటికే సోనియాని ప్రేమించిన రాజీవ్ గాంధీ అందుకు నో చెప్పారట.ఆ తర్వాత రాహుల్ గాంధీకి కరీనాకపూర్ తో పెళ్లి చేయాలి అనుకున్నారట. ఇక అప్పట్లో కరీనాకపూర్ కూడా రాహుల్ గాంధీ పై క్రష్ పెంచుకుంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో మీకు ఎవరితో డేటింగ్ చేయాలనే కోరిక ఉంది అని ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ అడగగా...నేను రాహుల్ గాంధీతో డేటింగ్ చేస్తాను అని ధైర్యంగా చెప్పింది.
అంతేకాకుండా రాహుల్ గాంధీకి కూడా కరీనాకపూర్ అంటే ఇష్టమట. కరీనాకపూర్ నటించిన చాలా సినిమాలను ఆయన విడుదలైన ఫస్ట్ రోజే చూస్తారట. ఇద్దరి వైపు నుండి పాజిటివ్ రెస్పాన్సే ఉన్నా కూడా ఎందుకో ఈ జంట పెళ్లి పీటల వరకు వెళ్లలేదు.అనూహ్యంగా కరీనాకపూర్ రెండో పెళ్లి వాడైన సైఫ్ అలీఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఈ విషయం బయటపడడంతో కరీనాకపూర్ మీద ప్రేమతోనే రాహుల్ గాంధీ ఇంకా పెళ్లికి దూరంగా ఉన్నారా అని సోషల్ మీడియాలో ఆయనపై కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్