Heroes: నాగార్జున బాలకృష్ణ మధ్య గొడవ అక్కడే మొదలైందా.?

అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ ల మధ్య గొడవ ఉందనే సంగతి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే వీరిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో తెలియదు కానీ ఒకప్పుడు వీరు మంచి స్నేహితులు.


Published Aug 02, 2024 07:16:28 AM
postImages/2024-08-02/1722599032_nagarjunabalakrishna.jpg

న్యూస్ లైన్ డెస్క్: అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ ల మధ్య గొడవ ఉందనే సంగతి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే వీరిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో తెలియదు కానీ ఒకప్పుడు వీరు మంచి స్నేహితులు. అంతే కాదు నందమూరి ఇంట్లో జరిగే ఫంక్షన్ కి అక్కినేని ఫ్యామిలీ,అక్కినేని ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్లకి నందమూరి ఫ్యామిలీ హాజరవుతుండేది. అంతేకాకుండా నాగేశ్వరరావు,సీనియర్ ఎన్టీఆర్ లు చాలా మంచి స్నేహితులు.

ఆ తర్వాత కాలంలో నాగార్జున, బాలకృష్ణ కూడా మంచి మిత్రులుగానే కొనసాగారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడన్గా వీరిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. అయితే జోష్ సినిమా ఈవెంట్ లో  నాగార్జునపై బాలకృష్ణ సరదాగా వేసిన ఓ సెటైర్ నాగార్జున కి కాస్త కోపం తెప్పించిందని, ఆ మాటలే నాగార్జున, బాలకృష్ణ గొడవకు కారణమయ్యాయి అనే వార్తలు ఉన్నాయి. ఇక విషయంలోకి వెళ్తే..నాగార్జున నాగ చైతన్య మొదటి మూవీ జోష్ ని భారీ ఎత్తున ప్రమోట్ చేశారు.

దీంతో కొడుకు సినిమా ఈవెంట్ కోసం ఎంతోమంది అతిరథ మహారథులను ఆహ్వానించారు. అందులో భాగంగా సినీ డైరెక్టర్లను,దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులందరికీ అలాగే కొంతమంది బడా రాజకీయ నాయకులను కూడా తీసుకువచ్చారట. ఇందులో భాగంగా బాలకృష్ణకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పగా ఆయన కూడా జోష్ మూవీ ఈవెంట్ కి వచ్చారు.కానీ వచ్చాక అక్కడ ఫన్నీగా నాగార్జున సేమ్ నాగేశ్వరరావు లానే ఉన్నారు. ఆయన పోలికలన్నీ ఈయనకు కూడా వచ్చాయి. పక్కా కమర్షియల్ బిజినెస్ మాన్ అంటూ నవ్వుకుంటూనే నాగార్జున పై సెటైర్ వేశాడు బాలకృష్ణ.

దాంతో ఈయన మాటలకు నాగార్జున కాస్త హర్ట్ అయ్యారట. కానీ దాన్ని మొహంలో కనిపించకుండా కవర్ చేసి ఫక్కున ఒక నవ్వు నవ్వారు. అంతే ఇక అదే నాగార్జున బాలకృష్ణ మధ్య దూరం పెంచిందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.ఇక ఆ మధ్యకాలంలో బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం సృష్టించాయి.ఈ విషయంలో అక్కినేని ఫ్యాన్స్ బాలకృష్ణను తిట్టిపోసారు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sr-ntr balakrishna nagarjuna nagachaitanya josh-movie nageshwar-rao

Related Articles