Chiranjeevi:ఆ బ్లాక్ బస్టర్ సినిమాకు చిరంజీవి డైరెక్టర్ గా చేశారని తెలుసా.?

చిరంజీవి అంటే మనకు ఒక స్టార్ హీరో గానే తెలుసు. ఆయన ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలో నటుడిగానే చేశారు తప్ప ఇతర  ఏ పనులు చేయలేదు. అలాంటి చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో


Published Aug 21, 2024 05:19:50 PM
postImages/2024-08-21/1724240990_chiranjeevi.jpg

న్యూస్ లైన్ డెస్క్: చిరంజీవి అంటే మనకు ఒక స్టార్ హీరో గానే తెలుసు. ఆయన ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలో నటుడిగానే చేశారు తప్ప ఇతర  ఏ పనులు చేయలేదు. అలాంటి చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా చేసిన ఒక చిత్రం కూడా ఉంది. ఆ సినిమా ఇండస్ట్రీలోనే బ్లాక్ బాస్టర్ హిట్. మరి ఆ మూవీ ఏంటి ఆ వివరాలు చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి  తన కెరీర్ లో అత్యంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిన చిత్రాలలో ఇంద్ర మూవీ కూడా ఒకటి.  ఈ సినిమా కథపరంగా కానీ సాంకేతికపరంగా కానీ అన్ని విధాలా బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పవచ్చు.

అలాంటి ఈ చిత్రం  చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మరోసారి రిలీజ్ అవుతోంది. దీంతో మెగా అభిమానులందరు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే తరుణంలో ఇంద్ర సినిమా గురించి ఒక అద్భుతమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇంద్ర సినిమాకు డైరెక్టర్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా చేశారట.  ఈ విషయాన్ని రాజా రవీంద్ర ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఈ సినిమా డైరెక్టర్ అయినటువంటి బి గోపాల్ జూనియర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు చిత్ర సాంగ్స్ డైరెక్షన్ కోసం స్విట్జర్ల్యాండ్ వెళ్లారట. ఇదే సమయంలో ఇంద్ర మూవీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్, హోమం సీన్, కొన్ని సాంగ్స్ ఎపిసోడ్స్ అన్ని  చిరంజీవి తన సొంత డైరెక్షన్ లో చేశారట. ఈ విధంగా చిరు తన సొంత సినిమానే  డైరెక్షన్ చేసి చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేలా చేశారని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu jr-ntr tollywood b-gopal indra

Related Articles