Pawan:పవన్ రేణులతో ఉన్న ఈ పాపని గుర్తుపట్టారా..ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్.!

పై ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ ముగ్గురు ఇండస్ట్రీలో పెద్ద స్టార్లే. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఆయన పక్కన ఉన్న ఆమె హీరోయిన్ రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ కు రెండో భార్యగా


Published Aug 07, 2024 06:14:03 PM
postImages/2024-08-07//1723034643_pawankalyanrenuniharika.jpeg

న్యూస్ లైన్ డెస్క్: పై ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ ముగ్గురు ఇండస్ట్రీలో పెద్ద స్టార్లే. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఆయన పక్కన ఉన్న ఆమె హీరోయిన్ రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ కు రెండో భార్యగా వచ్చి,ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు.

ఇక ఇద్దరి పక్కనే ఉన్నటువంటి ఆ పాపే ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఇండస్ట్రీలో యాంకర్ గా, హీరోయిన్ గా, ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తోంది.  ఇంతకీ ఆ పాప ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతని రెండవ భార్య రేణు దేశాయ్ పక్కపక్కనే కూర్చున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పక్కన కూర్చున్న ఆ చిన్నారి  మెగా ఫ్యామిలీకి చెందిన ఆడపిల్ల.

ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే  పవన్ కళ్యాణ్ రెండో అన్నయ్య నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో అందరూ స్టార్ హీరోలుగా ఎదిగారు. కానీ అమ్మాయిల్లో మాత్రం ఎవరు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు.నిహారిక ఒక్కతే హీరోయిన్ గా పలు చిత్రాలు చేసిన ఆకట్టుకోలేక పోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ నిర్మాణరంగంలో అడుగుపెట్టింది. వెబ్ సిరీస్ ఇప్పటికే నిర్మించి రిలీజ్ చేసింది.

 ప్రస్తుతం ఈమే నిర్మాణ సారధ్యంలో వచ్చినటువంటి "కమిటీ కుర్రోళ్లు" సినిమా త్వరలో రిలీజ్ కు సిద్ధమైంది. ఇదే తరుణంలో నిహారిక  ప్రమోషన్స్ విపరీతంగా చేస్తుంది.  ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించినటువంటి చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనికి తోడు తన బాబాయ్ పిన్ని పక్కపక్కనే ఉండడం వల్ల ఈ ఫోటో మరింత హైలెట్ అవుతుందని చెప్పవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pawan-kalyan tollywood renu-desai niharika committee-kurrallu-movie

Related Articles