Mallishwari: మల్లీశ్వరి మూవీలోని ఈ చిన్నారి గుర్తుందా..  ఇప్పుడు చూస్తే షాకే.?

విక్టరీ వెంకటేష్ హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలు నటించారు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే దూరిపోతారు హీరో వెంకటేష్. అలాంటి వెంకటేష్  మల్లీశ్వరి సినిమా అంటే అందరికీ తెలుసు. ఈ చిత్రానికి కె.విజయభాస్కర్ డైరెక్షన్


Published Aug 09, 2024 04:21:42 PM
postImages/2024-08-09/1723200702_mallishwari.jpg

న్యూస్ లైన్ డెస్క్: విక్టరీ వెంకటేష్ హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలు నటించారు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే దూరిపోతారు హీరో వెంకటేష్. అలాంటి వెంకటేష్  మల్లీశ్వరి సినిమా అంటే అందరికీ తెలుసు. ఈ చిత్రానికి కె.విజయభాస్కర్ డైరెక్షన్ చేశారు. 2004లో  రిలీజ్ అయినటువంటి ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. అలాంటి ఈ చిత్రంలో వెంకటేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు.

అలాగే ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా హీరోయిన్ గా చేసింది. ఇక ఈ మూవీలో వెంకీ కామెడీ మాత్రం అదిరిపోతుంది అని చెప్పవచ్చు. మల్లీశ్వరి సినిమాలో  నటించినటువంటి  చైల్డ్ ఆర్టిస్టు చాలామందికి గుర్తుండే ఉంటుంది.  ఇందులో వెంకటేష్ అన్న కూతురిగా ఆ చిన్నారి నటిస్తుంది. ఇందులో ఆ పాప వెంకటేష్ కే పంచ్ డైలాగ్ లు వేస్తుంది.

అలా క్యూట్ క్యూట్ మాటలు మాట్లాడిన చిన్నారి పేరు గ్రీష్మ నేత్రిక. అలాంటి గ్రీష్మ నేత్రిక ప్రస్తుతం మారిపోయింది.  హీరోయిన్ అందానికి ఏమాత్రం తగ్గకుండా తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈమె కేవలం మల్లీశ్వరి సినిమానే కాకుండా ప్రస్థానం, పంచాక్షరి,అశోక్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి చిత్రాల్లో నటించింది.

అయితే ఈ ముద్దుగుమ్మ పెద్దయ్యాక సినిమాల్లో  నటించడం మానేసి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోందట. అలాంటి గ్రీష్మ నేత్రిక ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో  మల్లీశ్వరిలో చిన్నారి ఇంత పెద్దదయ్యిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు కూడా ఆ ఫోటోలు చూసేయండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu venkatesh katrina-kaif greeshma-netrika mallishwari

Related Articles