Balakrishna:శ్రీదేవి మీద బాలకృష్ణకు ఆ అభిప్రాయం ఉండేదా?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు వచ్చి హీరోలు, హీరోయిన్లు పాన్ ఇండియా స్టార్లు అవుతున్నారు కానీ, పాన్ ఇండియా చిత్రాలు లేకముందే పాన్ ఇండియా స్టార్ గా మారింది అతిలోకసుందరి శ్రీదేవి.


Published Sep 03, 2024 09:19:33 AM
postImages/2024-09-03/1725369461_balayya.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు వచ్చి హీరోలు, హీరోయిన్లు పాన్ ఇండియా స్టార్లు అవుతున్నారు కానీ, పాన్ ఇండియా చిత్రాలు లేకముందే పాన్ ఇండియా స్టార్ గా మారింది అతిలోకసుందరి శ్రీదేవి. అప్పట్లో ఈమె హీరోయిన్ గా ఉందంటే ఆ సినిమా తప్పనిసరిగా హిట్టే.  అలాంటి శ్రీదేవి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ ఇలా అన్ని భాషల్లో నటించింది.  ఈమె అలనాటి హీరోలైనటువంటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలు జూనియర్ ఎన్టీఆర్ తరం హీరోలతో కూడా నటించింది.

ఆ విధంగా  ఎంతో గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది హీరోలతో తెరను పంచుకున్న శ్రీదేవి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి వారితో కూడా హీరోయిన్ గా చేసింది.  కానీ ఈమె బాలకృష్ణతో మాత్రం నటించలేకపోయింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఎన్నోసార్లు అభిమానులు ఎదురుచూశారు. వారి ఆశలు గల్లంతయ్యాయి. శ్రీదేవితో నటించే ఆఫర్ బాలకృష్ణకి ఎన్నోసార్లు వచ్చిందట. కానీ ఆయన రిజెక్ట్ చేస్తూ వచ్చారట. దీనికి కారణం ఏంటో కూడా బాలకృష్ణ చెప్పారు.

అయితే తన నాన్న సీనియర్ ఎన్టీఆర్ తో నటించిందని, ఆయనతో అనేక పాత్రలు చేసిన ఆమె నాతో నటించడం సెట్ కాదని ఆలోచన నాకే వచ్చిందని అన్నారు. ఆమె మామూలు కథల్లో నటిస్తే బాగుండదని "జగదేకవీరుడు అతిలోకసుందరి" లాంటి మంచి కంటెంట్ ఉన్న కథలు చేస్తేనే ఆమెకు సెట్ అవుతాయని, ఈ చిన్న కథల్లో ఆమెతో నటించడం నాకు ఇష్టం లేకనే ఇంతవరకు నేను శ్రీదేవితో చేయలేదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu sr-ntr balakrishna nagarjuna sridevi jagadekavirudu-atiloka-sundari

Related Articles