కొన్ని రోజుల తర్వాత గౌరవ్‌ను టీచర్ గౌరి తివారీ ఇబ్బందులు పెట్టి డబ్బులు తీసుకునేది.
న్యూస్ లైన్ డెస్క్: ఇంగ్లీష్ టీచర్ స్టూడెంట్‌ను లోంగదీసుకొని డబ్బులు లాగింది. కాగా, చివరికి రేప్ కేసు పెట్టడంతో మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇండోర్‌లో గౌరి తివారీ (41) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఇండోర్‌లోని ప్రముఖ స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్‌గా ఉద్యోగం చేస్తుంది. టీచర్ ఉద్యోగం చేస్తున్న మేడమ్ గౌరి తివారీ అందమైన అబ్బాయిలతో చనువుగా ఉంటుంది. అయితే స్కూల్‌లో పిల్లలకు పాఠాలు చెబుతున్న టీచర్ విద్యార్థులతో చనువుగా ఉంటున్నదని సాటి టీచర్లు చెప్పారు.
ఇంగ్లీష్ టీచర్ గౌరి ఇండోర్‌కు చెందిన 19 ఏళ్ల బీఫార్మసీ స్టూడెంట్ గౌరవ్‌తో ప్రేమలో పడింది. కాగా, కొన్ని రోజుల తర్వాత గౌరవ్‌ను టీచర్ గౌరి తివారీ ఇబ్బందులు పెట్టి డబ్బులు తీసుకునేది. ఇటీవల గౌరవ్‌పై ఆ టీచర్ రేప్ కేసు పెట్టడంతో పోలీసులు గౌరవ్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విత్ డ్రా చేసుకునేందుకు పోలీసులు రూ.3 లక్షలు డిమాండ్ చేయగా గౌరవ్ తండ్రి రూ.45 వేలు ఇచ్చి గౌరవ్‌ను బయటకు తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన గౌరవ్ మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. తమ కొడుకుని టీచర్ చంపేసిందని, వెంటనే తనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.