రేవంత్ రెడ్డి దగ్గరికి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఫైల్ వస్తే అందులో హెల్త్ ఉందని హెల్త్ డిపార్ట్మెంట్కి పంపించారని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఉన్న తెలివి అటువంటిదని ఆయన అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: పబ్లిక్ హెల్త్ ఫైల్ ఎవరికి పంపాలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి తెలియదని మాజీ ఎమ్మెల్యే, BRS నేత గాదరి కిశోర్ ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దగ్గరికి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఫైల్ వస్తే అందులో హెల్త్ ఉందని హెల్త్ డిపార్ట్మెంట్కి పంపించారని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఉన్న తెలివి అటువంటిదని ఆయన అన్నారు.
పబ్లిక్ హెల్త్ ఫైల్ ఎవరికి పంపించాలో సి అనేది కూడా ఆయనకు తెలియదని విమర్శించారు. అటువంటి సీఎంకు ఇరిగేషన్, రాష్ట్రం గురించి ఎలా తెలుస్తుందని గాదరి కిశోర్ ప్రశ్నించారు. ఆదివారం ఉదయాన్నే హైడ్రా పేరుతో దొంగల లాగా పేదల ఇళ్ల వద్దకు వెళ్లి హడావుడి చేశారని ఆయన అన్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి హైడ్రా కాస్తా హైడ్రాప్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మీద ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను హైడ్రా పేరుతో పక్కదారి పట్టించడమే కాంగ్రెస్ మొదటి అజెండా అని ఆయన అన్నారు. పేదలకు నోటీసులు పంపించి బ్లాక్ మెయిల్ చేసి.. ఎన్నికల ఖర్చులకు పంపాలనేది మరో అజెండా అని అన్నారు.