Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి నయా అప్‌డేట్

ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను సెప్టెంబర్‌లో ప్రకటించోతున్నట్లు మేకర్స్ తెలుపుతూ ఓ కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.


Published Sep 07, 2024 03:47:20 PM
postImages/2024-09-07/1725704240_gamechanger.PNG

న్యూస్ లైన్ సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నటిస్తున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకతం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటీకే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను 2024 క్రిస్మస్​కు రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్​రాజు ప్ర‌క‌టించారు.

శనివారం ఈ మూవీ నుంచి వినాయ‌క చ‌వితి పండుగ సందర్భంగా ఓ స్పెష‌ల్ అప్‌డేట్‌ను మూవీయూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను సెప్టెంబర్‌లో ప్రకటించోతున్నట్లు మేకర్స్ తెలుపుతూ ఓ కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ మూవీలో సునీల్, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్లర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి పాపులర్ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీకి ఎస్‌ థమన్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు.

Related Articles