Game Changer : మెగా ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇచ్చిన టీం!

జరగండి సాంగ్ మూవీపై బజ్ క్రియేట్ చేస్తున్నా..మూడేళ్ల నుంచి శంకర్ ఏం తీస్తున్నాడంటు నిరాశ మాత్రం ఫ్యాన్స్ లో కనిపించింది.


Published Aug 07, 2024 06:38:21 AM
postImages/2024-08-07/1723030668_sddefault.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హమ్మయ్య ఎట్టకేలకు డైరక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కు టీం ముహూర్తం ఫిక్స్ చేసింది. ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ నటిస్తోన్న ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, జరగండి సాంగ్ మూవీపై బజ్ క్రియేట్ చేస్తున్నా..మూడేళ్ల నుంచి శంకర్ ఏం తీస్తున్నాడంటు నిరాశ మాత్రం ఫ్యాన్స్ లో కనిపించింది.


ఈ మూడేళ్లలో కేవలం సినిమా నుంచి ఒక్క సాంగ్ మినహా మరో అప్డేట్ రాలేదు. దీంతో చిత్రయూనిట్ తీరుపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది. డిసంబర్ 25 క్రిస్మిస్ రోజున సినిమా రిలీజ్ కు ముహూర్తం కుదిర్చింది.


రీసెంట్ గా ఈ సినిమా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. నిర్మాత దిల్ రాజు పూజా కార్యక్రమాలతో ఈరోజు డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో అటు షూటింగ్ అయిపోవడం.. ఇటు డబ్బింగ్ వర్క్ షూరు చేయడంతో త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమాను నుంచి వరుస అప్డేట్స్ రావడం ఖాయమని ఖుషి అవుతున్నారు .ముందుగా చెప్పినట్లు ఈ మూవీని  ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ఈ మంథ్ లాస్ట్ లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. లెట్స్ వెయిట్ గేమ్ ఛేంజర్.
 

newsline-whatsapp-channel
Tags : ram-charan movies shankar-director game-changer

Related Articles